బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వేళ.. ఒక్కసారిగా మారిన వాతావరణం: బెంగళూరులో కుండపోత: మరో మూడు రోజుల పాటు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ..కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తెల్లవారు జాము నుంచి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. కుండపోతగా వర్షం కురుస్తోంది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మరో 72 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందటూ భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

బెంగళూరులో ఈ తెల్లవారు జాము నుంచే భారీగా వర్షం పడసాగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉరుములు, మెరుపులు ఆరంభం అయ్యాయి. వాతావరణం ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయింది. ఈదురు గాలులు వీచాయి. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆ వెంటనే చినుకులుతో ఆరంభమైన వర్షం చూస్తుండగానే కుండపోతగా మారింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

Heavy rain reported in Bengalugu with thunder and lightning

యశ్వంతపుర, మల్లేశ్వరం, రాజాజీ నగర, మెజస్టిక్, చిక్‌పేట, మహాత్మాగాంధీ రోడ్డు, సదాశివ నగర, బీటీఎస్ రోడ్డు, విల్సన్ గార్డెన్ వంటి ప్రాంతాలతో పాటు బెంగళూరు శివార్లలోనూ భారీ వర్షం పడింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఈదురుగాలులు వీయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. వాహనాలేవీ రోడ్డు మీదికి రాలేదు.

బృహత్ బెంగళూరు మహానగర పాలికె సిబ్బంది వర్షపునీటిని తోడేసే పనిలో నిమగ్నం అయ్యారు. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ అనూహ్య మార్పు వల్ల కరోనా వైరస్ మరంత వేగంగా ప్రబలే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే బెంగళూరులో 91కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసినట్లు సమాచారం.

బెంగళూరుతో పాటు చిక్‌మగళూరు, కొడగు, శివమొగ్గ, హసన్ వంటి ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. హుంచదకట్టె, కలస, బరమసాగర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా విభాగం డైరెక్టర్ డాక్టర్ జీఎస్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. దక్షిణ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మరి కొన్ని రోజుల పాటు ఇదే తరహా వాతవరణం ఉండొచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు.

Recommended Video

Tony Lewis Of 'DLS Method' Fame Passed Away

English summary
The meteorological department has predicted that south interior Karnataka will witness heavy rain coupled with thunder and lightning for three days commencing from Thursday, April 23. The department has issued yellow alert for Chikkamagaluru, Kodagu, Hassan and Shivamogga districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X