వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణలకు పొంచివున్న భారీ వర్షాలు: రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం: ఐఎండీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తమిళనాడు, యానాం, పుదుచ్చేరిలకూ భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల మీద ఆవర్తనం ఏర్పడిందని, ఫలితంగా- దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

Recommended Video

Heavy Rainfall In AP & TS రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం.. 24, 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావం వల్ల ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. 23, 24 తేదీల్లో తమిళనాడు కోస్తా తీర ప్రాంత జిల్లాలు, కరైకల్‌లో వర్షం పడే సూచనలు ఉన్నాయని అన్నారు. 23 నుంచి 27వ తేదీ వరకూ దశలవారీగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

heavy rainfall over Tamilnadu, Puducherry, Andhra Pradesh and Telangana on 26th November: IMD

ఉపరితల ఆవర్తనం క్రమంగా వాయుగుండంగా మారడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావం వల్ల 23 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ నెల 27 నాటికి మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్ఛిమ వాయవ్య దిశ వైపు కదులుతుందని, ఈ నెల 25వ తేదీ నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి చేరుతుందని తెలిపారు.

వీటి ప్రభావం వల్ల రాగల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ భారీ వర్షాల తీవ్రత కొనసాగుతుందని అన్నారు. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకుండా ముందు జగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు, తీర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు.

English summary
IMD predict that Isolated extremely heavy rainfall over Tamilnadu, Puducherry and Karaikal during 24th-25th November; over south Coastal Andhra Pradesh and Yanam, Rayalseema on 25th-26th November over Telangana on 26th November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X