వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు ... రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ముంబైలో వర్షాలు.. రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం || Heavy Rain Lashes Mumbai,Causes Waterlogging

ఆర్థిక రాజధాని అయిన ముంబైని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత శుక్రవారం నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక నేటికీ అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగటంతో నగరంలోని కొన్ని చోట్ల అంధకారం అలముకుంది. ఆదివారం రాత్రంతా ముంబయి, శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రధాన రహదారులు,లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు నీళ్ళల్లో తేలియాడుతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాలు నీట మునిగిపోవటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది .

ముంబైలో వర్షాలు.. రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం

ముంబైలో వర్షాలు.. రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం

ముంబైలో వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ముంబయి డివిజన్‌లోని పాల్ఘర్‌ ప్రాంతంలో వర్షం కారణంగా ముంబయి-అహ్మదాబాద్‌ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను కూడా గంట పాటు ఆలస్యంగా నడిచింది.వరద ప్రవాహం ఎక్కువకావడంతో సియోన్‌ రైల్వేస్టేషన్‌-మతుంగ స్టేషన్‌ మధ్య పట్టాలపైకి నీరు చేరింది.జామ్రంగ్‌‌- ఠాకూర్వాడీ మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో అటు వైపు నడిచే 10 రైళ్లను రద్దు చేశారు.రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచి ఉండటంతో పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి.

పలు రైళ్ళు రద్దు .. పలు రైళ్ళు ఆలస్యం .. వేగం 30 కిమీ కే పరిమితం

పలు రైళ్ళు రద్దు .. పలు రైళ్ళు ఆలస్యం .. వేగం 30 కిమీ కే పరిమితం

నిన్న రాత్రిపూట 360 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది . ఈ రోజు తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య కనీసం 100 మి.మీ వర్షపాతం నమోదైన కారణంగా రైల్వే ట్రాక్ లు నీట మునిగాయి. .ముంబై, థానే, రాయ్‌గడ్, పాల్ఘర్‌లలో భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది .పాల్ఘర్ విభాగంలో ట్రాక్స్ పై నీరు నిలిచి ఉన్న కారణంగా ముంబై-వల్సాద్-సూరత్ విభాగంలో కొన్ని రైళ్లు రద్దయ్యాయని పశ్చిమ రైల్వే పలు ట్వీట్లలో పేర్కొంది. ఇక కాస్త నీరు తగ్గిన తర్వాత పశ్చిమ రైల్వే ఉదయం 8.05 గంటలకు రైళ్ళను కొన్నింటిని పునరుద్ధరించామని పేర్కొన్నారు. . అయితే, రైలు వేగాన్ని మాత్రం గంటకు 30 కి.మీ.కు పరిమితం చేశారు.

హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖ .. వర్షాలు ఇంకా పెరుగుతాయంటున్న స్కైమేట్

హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖ .. వర్షాలు ఇంకా పెరుగుతాయంటున్న స్కైమేట్

సియోన్ మరియు మాతుంగా స్టేషన్ల మధ్య ట్రాక్‌లు మునిగిపోయాయి. భారీ గాలులతో మెరైన్ లైన్స్ వద్ద ట్రాక్‌లపై పక్కనే నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించిన కట్టెలు అడ్డుగా పడ్డాయి. దీంతో చర్చిగేట్-మెరైన్ లైన్స్‌లోని అన్ని రైళ్లు నిలిపివేయబడ్డాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి కాని ముందు జాగ్రత్త చర్యగా మరిన్ని తనిఖీలు జరుగుతున్నాయి. వెస్ట్రన్ రైల్వే ప్రకారం, చర్చి గేట్ మరియు ముంబై సెంట్రల్ మధ్య రైళ్లు అప్ & డౌన్ ఫాస్ట్ లైన్స్ లో నడుస్తున్నాయి. నెమ్మదిగా లైన్లలో ట్రాఫిక్ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ముంబై, పూణే మధ్య నడుస్తున్న రైళ్లు ఆలస్యం అయ్యాయి.పాల్ఘర్ స్టేషన్ వద్ద నీటిలో రైల్వే లైన్లు మునిగిపోవటంతో ప్రయాణీకుల విచారణ కోసం వెస్ట్రన్ రైల్వే హెల్ప్ డెస్క్ నంబర్లను ఏర్పాటు చేసింది.స్కైమెట్ ప్రకారం, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం పశ్చిమ తీరం వైపు కదులుతోంది. జూలై 3 రాత్రి నుండి వర్షపాతం పెరిగే అవకాశం ఉందని స్కైమేట్ పేర్కొంది.

English summary
Mumbaikars may be in for another harrowing days as India Meteorological Department has predicted that Mumbai rains will have their effect as well.At least 100 mm of rainfall was recorded between 4 and 5 am today, with more than 360 mm recorded overnight, leading to cancellation of some trains in the Mumbai-Valsad-Surat section. Local trains in Mumbai are running late after waterlogging on railway tracks due to heavy overnight rain in the city. Several short and long-distance trains have also been delayed or cancelled. According to private weather forecaster Skymet, levels of rainfall are likely to increase from the night of July 3, following a weather system forming in the Bay of Bengal that is moving towards the western coast of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X