వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో దంచికొట్టిన వాన.. 19 ఏళ్ల తర్వాత ఇలా...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీకి రుతుపవనాలు ఆలస్యంగా చేరినా.. వర్షాలు మాత్రం దంచికొడుతున్నాయి. జూలైలో ఇప్పటివరకు 381 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే అధిక వర్షాపాతం అని ఐఎండీ అధికారులు తెలిపారు. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మూడు గంటల్లోనే వంద మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని పేర్కొంది.

2013, జూలై 21న 123.4 మిల్లీమీటర్ల వర్షాపాతం కురిసింది. 19 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ సారి దేశ రాజధానికి రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరాయి. ఈ నెలలో 14 రోజులు వర్షాలు కురిశాయి. భారీ వానలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీ పరిధిలో ఈ నెల 27 వరకు 108 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. సాధారణ వర్షాపాతం 183.5 మిల్లీమీటర్లు. 2003లో ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయిలో 632.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

heavy rains in delhi

గకొద్ది సంవత్సరాలుగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిందని స్కైమెట్‌ వెదర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ షలావత్‌ పేర్కొన్నారు. నగరాల్లో తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వివరించారు. ఇంతకుముందు మూడు, నాలుగు రోజుల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయితే.. ప్రస్తుతం ఐదారు గంటల్లో రికార్డ అవుతుందన్నారు. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరుగవని, వర్షపాతం నెమ్మదిగా ఉంటే భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉంటుందన్నారు.

ఉత్తరాదిలో వర్షబీభత్సం కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. జనానికి ఇబ్బందులు తప్పడం లేదు

English summary
heavy rains in national capital delhi. after 19 years rains lashed heavy in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X