వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో వర్ష బీభత్సం: 35కు పెరిగిన మృతుల సంఖ్య, 11 డ్యాంలకు రెడ్ అలర్ట్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు నీటి మునగడం, పలువురు వరదలో గల్లంతు కావడంతో కేరళ రాస్ట్రంలో దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది. భారీ వర్షాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు కేరళలో 35కి చేరింది.

Recommended Video

Kerala Floods : 11 డ్యాంల వద్ద Red Alert ప్రమాదకర స్థాయి | Idukki | Kerala Rains || Oneindia Telugu

వరదనీరు భారీగా ఆనకట్టలకు పొటెత్తుతోంది. దీంతో డ్యాంల వద్ద నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 డ్యాంల వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు అదికారులు. ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. ఇడుక్కి డ్యాం వద్ద గేట్లు మంగళవారం ఉదయం 11 గంటలకు తెరవనున్నారు.

 heavy rains in Kerala: Deaths toll to 35, red alert issued for 11 dams across state

వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 11 ఆనకట్టల వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. వరద బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 247 క్యాంపులను ఏర్పాటు చేసింది.

కక్కి డ్యాం రెండు షెటర్లను తెరవడంతో పంపా నది నీటి మట్టం బాగా పెరుగుతోంది. దీంతో శబరిమల అయ్యప్పస్వామి దేవాలయానికి భక్తుల యాత్రను అధికారులు నిలిపివేశారు. భక్తులంతా తక్షణమే తిరిగి వెళ్లిపోవాలని దేవస్థానం బోర్డు కోరింది.

ఇక భారీ వర్షాల కారణంగా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 21, 23 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. వాటి తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల వరద ధాటికి ఇల్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి.

English summary
heavy rains in Kerala: Deaths toll to 35, red alert issued for 11 dams across state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X