చెన్నైలో దంచికొట్టిన వాన: రోడ్లన్నీ జలమయం, భారీ ట్రాఫిక్జామ్, ముగ్గురు మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కురిసిన అతి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు నదులను తలపించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
Visuals from Rajarathinam Stadium in Egmore, #Chennai. #ChennaiRains
— Mugilan Chandrakumar (@Mugilan__C) December 30, 2021
Video as received. pic.twitter.com/uH7RNPDCIz
కాగా, రాబోయే కొద్దిగంటల్లో మరికొన్నిచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే చెన్నైలో కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల నగరంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. మరోవైపు మెట్రో పనులు కూడా జరుగుతుండటంతో వడపళనిలో వరదనీరు భారీగా వచ్చి చేరింది. అటుగా వెళ్లే వాహనదారులు రోడ్డు దాటలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
#chennairains Traffic 😱 pic.twitter.com/Qfe68okSdU
— Gingee Weather Updates☔🌦⛈ (@WeatherRains) December 30, 2021
భారీ వర్షాల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై నగరంలోని ఓ ప్రాంతంలో వరదనీటిలో మహిళ శవం స్థానికంగా కలకలం సృష్టించింది.
GP road. Near LIC #ChennaiRains pic.twitter.com/u5U3oE7Ow9
— Stalin SP (@Stalin__SP) December 30, 2021
ఎగ్మూర్, సెంట్రల్, పురసైవాక్కం, గిండి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. బంగాళాఖాతంలో తూర్పు వైపు దిశగా గాలులు దూసుకుస్తున్నాయి. తీరం వెంబడి నగరాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.