వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెదర్ అప్‌డేట్: కర్ణాటక, ఒడిశాలో వర్ష బీభత్సం.. ముంబై శివారులో కూడా..

|
Google Oneindia TeluguNews

దేశంలో గల మూడింత రెండు వంతుల వర్షపాతం నమోదు కానుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటకలో అధిక వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బీహర్‌లో కూడా

బీహర్‌లో కూడా

ఈ నెల 27వ తేదీ నుంచి వాయువ్య భారతదేశం, రాజస్థాన్ అవల వర్షపాతం మరింత పుంజుకోనుంది. ఈశాన్య ప్రాంతంలో కూడా అదేవిధంగా వర్షపాతం నమోదు కానుంది. బీహర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెండు మూడు రోజుల్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో వర్షం కురవనుంది. ఉత్తరప్రదేశ్‌లో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. రెండు మూడురోజుల్లో ఉత్తర ఉత్తరప్రదేశ్‌లో కూడా భారీ వర్షం కురవనుంది. ఉత్తరాఖండ్‌లో కూడా సేమ్ ఇదే సిచుయేషన్ ఉంది. దక్షిణ గుజరాత్ నుంచి ఉత్తర కేరళ తీరం వరకు అల్పడీన ద్రోణి కొనసాగుతోంది. కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో వర్షాలు కురవనున్నాయి.

ముంబై శివారులో మాత్రం

ముంబై శివారులో మాత్రం


శనివారం ముంబైలో తేలికపాటి జల్లులు కురిశాయి. శివారు ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగానే ఉంటుంది. పాల్గర్, థానే, రాయ్ గడ్, రత్నగిరి, సింధు దుర్గ్‌లో కాస్త ఎక్కువగా వర్షం కురవనుంది. బాంద్రాలో 59.5 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. దహిసర్ 137.5 మి.మీ, జుహులో 63.5, రామ్ మందిర్‌లో 68, చెంబూర్‌లో గల టాటా పవర్ 59 చొప్పున వర్షం కురిసింది.

Recommended Video

WTC Final Day 3: Southampton Weather Forecast | Oneindia Telugu
కర్ణాటక, ఒడిశాలో ఇలా

కర్ణాటక, ఒడిశాలో ఇలా

కర్ణాటకలో భారీ వర్షం పడనుంది. దీంతో భారత వాతావరణ శాఖ కర్ణాటకకు రెడ్ అలర్ట్ జారీచేసింది. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడలో శని, ఆదివారాలు భారీ వర్షం కురవనుంది. కొడగు, హసన్, చిక్ మంగళూర్, శిమొగ్గలో ఆరంజ్ అలర్ట్ జారీచేశారు. ఇటు ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సుందరగడ్, జార్సుగుడ, బార్‌గడ్, సంబల్‌పూల్, డియోగడ్, అంగుల్, కియోన్‌జర్, మయూర్‌‌బంజ్, బాలాసోర్, భద్రక్, కేంద్రపర, జైపూర్, డెన్‌కనాల్‌లో వర్షం కురవనుంది.

English summary
India Meteorological Department has said in its two-week forecast that monsoon progress is likely to pick up between June 27 and June
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X