వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు: తెలుగు రాష్ట్రాలు మిన‌హా: ఐఎండీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

రానున్న 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల || IMD Warns Of Heavy Rainfall In Several States

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే ఉత్త‌రాది, ఈశాన్య రాష్ట్రాల‌ను ముంచెత్తుతున్న భారీ వ‌ర్షాలు మ‌రిన్ని రోజులు కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇదే విష‌యాన్ని జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ విభాగం (ఎన్డీఎంఏ) ధృవీక‌రించింది. వ‌చ్చే 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లు ఉన్న‌ట్లు తెలియ‌జేసింది.

వారి ఆశీర్వాదం లేనిదే ఏ ప‌నీ అయ్యేలా లేదు: య‌డ్యూర‌ప్ప‌ వారి ఆశీర్వాదం లేనిదే ఏ ప‌నీ అయ్యేలా లేదు: య‌డ్యూర‌ప్ప‌

ఈ విష‌యాన్ని ఎన్డీఎంఏ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ట్విట్ట‌ర్ ద్వారా జారీ చేసింది.కొంక‌ణ్‌, గోవా, హిమాల‌యా ఉప ప్రాంతాలు, ప‌శ్చిమ బెంగాల్‌, సిక్కిం,బిహార్‌, క‌ర్ణాట‌క తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, అసోం, మేఘాల‌యా వంటి ఈశాన్యా రాష్ట్రాల్లో కుండ‌పోతగా వ‌ర్షాలు ప‌డొచ్చ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.

Heavy to very heavy rainfall with extremely heavy falls very likely at isolated places over Konkan and Goa

రాజ‌స్థాన్ తూర్పు ప్రాంతం, కేర‌ళ‌, మ‌హె, క‌ర్ణాట‌క ద‌క్షిణ ప్రాంతాలు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హా రాష్ట్ర‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, హ‌ర్యానా, చండీగ‌ఢ్‌, ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్‌లో గంగాన‌దీ తీర ప్రాంతాలు, ఒడిశా, జార్ఖండ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర‌ల్లో మ‌రింత వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని పేర్కొంది. బిహార్‌, జార్ఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌, సిక్కింల‌ల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌.

అరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉండొచ్చ‌ని, గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని అంచ‌నా వేశారు ఆ శాఖ అధికారులు. అరేబియా స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లే మ‌త్స్య‌కారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేసింది. ఈ మేర‌కు ఆ శాఖ అధికారులు వ‌రుసగా ట్వీట్ల‌ను సంధించారు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల పేర్లు ఎక్క‌డా లేవు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ స‌హా త‌మిళ‌నాడుల్లో ఇప్ప‌ట్లో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు లేవ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ట‌యింది.

English summary
Thunderstorm accompanied by lightning very likely at isolated places over Bihar, Jharkhand, Madhya Pradesh, Chhattisgarh, Odisha and West Bengal & Sikkim. Heavy rainfall at isolated places over East Rajasthan, Kerala and Mahe, South Interior Karnataka, MP, Madhya Maharashtra, Himachal, Uttarakhand, Punjab, Haryana, Chandigarh & Delhi, Gangetic West Bengal, Odisha, Jharkhand and Nagaland, Manipur,Mizoram and Tripura.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X