• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సిద్దరామయ్య రూ. 1 కోటి బెంజ్ కారె గిఫ్ట్ ?, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటి, నాడు వజ్రాల వాచ్, నేడు!

|

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్దరామయ్య ఇంటి దగ్గర ప్రత్యక్షం అయిన బెంజ్ కారు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తాను బెంజ్ కారు బహుమతిగా ఇవ్వలేదని బెంగళూరులోని హెబ్బాళ శాసన సభ్యుడు భైరతి సురేష్ (కాంగ్రెస్) మీడియాకు చెప్పారు. రూ. 1 కోటికి పైగా విలువైన బెంజ్ కారు కహాని ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలించింది.

బస్సులో రిసార్టుకు ?

బస్సులో రిసార్టుకు ?

మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తాను ఎలాంటి బెంజ్ కారు బహుమతిగా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భైరతి సురేష్ అన్నారు. సిద్దరామయ్య ఇంటి ముందు ఉన్న బెంజ్ కారు తనదే అని భైరతి సురేష్ మీడియాకు చెప్పారు. తాను రిసార్టకు బస్సులో వెళ్లే సమయంలో సిద్దరామయ్య ఇంటి ముందు తన బెంజ్ కారు నిలిపానని, తరువాత ఆ రోజు డ్రైవర్ ఆ కారును అక్కడి నుంచి తీసుకుపోలేదని భైరతి సురేష్ అంటున్నారు.

వజ్రాల వాచ్ వివాదం !

వజ్రాల వాచ్ వివాదం !

సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయకు వజ్రాల వాచ్ బహుమతిగా ఇచ్చారని పెద్ద వివాదానికి దారి తీసింది. ఇప్పుడు రూ. 1 కోటి విలువైన బెంజ్ కారు సిద్దరామయ్యకు బహుమతిగా ఇచ్చారని ప్రచారం జరగడంతో మరో వివాదం తెరమీదకు వచ్చింది.

కారు ఎందుకు ఇవ్వాలి ?

కారు ఎందుకు ఇవ్వాలి ?

సిద్దరామయ్యకు తాను కారు ఎందుకు బహుమతిగా ఇవ్వాలి ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భైరతి సురేష్ ప్రశ్నిస్తున్నారు సిద్దరామయ్య ఎక్కువ దూరం ప్రయాణించే సందర్బంలో తన కారు ఉపయోగిస్తారని, ఆయన దగ్గర ఉన్న అడి కారు తనదే అని భైరతి సురేష్ మీడియాకు చెప్పారు.

మీడియా అతి ప్రచారం !

మీడియా అతి ప్రచారం !

తన కారు సిద్దరామయ్య ఇంటి ముందు పార్క్ చేసిన విషయం ఆయనకు తెలీదని భైరతి సురేష్ అంటున్నారు. తన కారును డ్రైవర్ ఇంటికి తీసుకు వచ్చాడని, అదే కారులో తాను ప్రస్తుతం తిరుగుతున్నానని భైరతి సురేష్ చెబుతున్నారు. అనవసరంగా మీడియా అతి ప్రచారం చేసిందని భైరతి సురేష్ ఆరోపించారు.

సిద్దరామయ్యకు ఖరీదైన కార్లు !

సిద్దరామయ్యకు ఖరీదైన కార్లు !

తన బెంజ్ కారు కంటే ఎక్కువ ఖరీదైన కార్లు సిద్దరామయ్య దగ్గర ఉన్నాయని, అయినా ఆయనకు తాను కారు ఎందుకు బహుమతిగా ఇవ్వాలని భైరతి సురేష్ మీడియాను ప్రశ్నించారు. సిద్దరామయ్య మీద ఆరోపణలు చెయ్యడం కొందరికి అలవాటైపోయిందని పరోక్షంగా బీజేపీ నాయకుల మీద భైరతి సురేష్ విరుచుకుపడ్డారు.

English summary
Bngaluru: Hebbal MLA and Congress leader Byrathi Suresh clarification on BENZ car gifted to Former chief minister Siddaramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X