వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డేకు ముందే దాడికి యత్నం, రెండు చోట్ల ఐఈడీ బాంబులతో అటాక్..?

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన నవీద్ బాబు కశ్మీర్‌లో దాడులకు ప్రణాళిక రచించినట్టు తెలిసింది. రిపబ్లిక్ డేకి ముందు కశ్మీర్‌లోని జాదూరా, నివా-ఫొఖేపొర వద్ద ఐఈడీ బాంబు పేల్చి అలజడి సృష్టించాలనుకొన్నాడని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భద్రతా సంస్థలకు తెలిపినట్టు సమాచారం.

సెకండ్ ర్యాంక్..

సెకండ్ ర్యాంక్..


నవీబ్ బాబు దక్షిణ, మధ్య కశ్మీర్‌కు హిజ్బుల్ ముజాహిద్దీన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. జాదూరా, నివా-ఫొఖేపొర రహదారిలో దాడులకు సంబంధించి నవీద్ బాబు తన సహచరులకు ఐఈడీ బాంబులను అందజేసినట్టు డీఐఏ పేర్కొన్నది. తన సహచరులతో నవీద్ బాబు మాట్లాడిన వివరాలను ఈ నెల 15వ తేదీన సేకరించినట్టు తెలిపింది. జనవరి 11వ తేదీన డీఎస్పీ దవిందర్ సింగ్.. నవీద్ బాబు సహా మరొ ఇద్దరిని కారులో ఢిల్లీ తరలిస్తూ అరెస్టైన సంగతి తెలిసిందే.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..

హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో రియాజ్ నైకూ తర్వాతి స్థానం నవీద్ బాబుదే. ఇదివరకు కశ్మీర్‌లో పౌరుల హత్యకు సంబంధించి, భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లే సమయంలో పోలీసులను కూడా హతమార్చారనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.

గత చరిత్ర..

గత చరిత్ర..

నవీద్ బాబు, సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ తరలిస్తోన్న డీఎస్పీ దవిందర్ సింగ్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు నవీద్ బాబుతో ఇదివరకు ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఎన్ఐఏ విచారిస్తోంది. బుధవారం దవిందర్ సింగ్ ఇంట్లో ఎన్ఐఏ టీం సోదాలు కూడా నిర్వహిచింది. కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంది. సింగ్ ఇళ్లు, కార్యాలయాలు ఎవరెవరు వచ్చి వెళ్లేవారని సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు.

 ఆరా..

ఆరా..

అంతేకాదు దవిందర్ సింగ్ అరెస్టయ్యే ముందు విధులు నిర్వర్తించిన శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సీసీటీవీ ఫుటీజీని కూడా పరిశీలించారు. సింగ్ యాంటీ హైజాకింగ్ యూనిట్ విభాగంలో పనిచేస్తూ.. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను ప్రవేశించేందుకు సాయం చేశారా అనే కోణంలో పరిశీలించారు. శ్రీనగర్, కాజికండ్, కుల్గాం జిల్లాలో కూడా విచారణ చేపట్టామని మరో అధికారి వివరించా

 ఫోన్ రికార్డుల పరిశీలన..

ఫోన్ రికార్డుల పరిశీలన..

దవిందర్ సింగ్ ఇతరులతో మాట్లాడిన సంభాషణలు కూడా పరిశీలిస్తున్నామని.. ఉగ్రవాదులకు సున్నితమైన సమాచారం అందజేశారనే కోణంలో పరిశీలించినట్టు పేర్కొన్నారు. గతేడాది దవిందర్ సింగ్ పనిచేసిన చోట కూడా ఎవరెవరితో మాట్లాడారు..? ఉగ్రవాదులతో లింక్ ఉన్న వారు ఉన్నారా అనే అంశాలపై కూడా ఆరాతీస్తున్నట్టు పేర్కొన్నారు.

English summary
Hizbul Mujahideen militant arrested along with a Jammu and Kashmir police officer this month was planning to deliver explosives in Pulwama for major attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X