Army helicopter Crash: 2015లో దిమాపూర్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ జనరల్ బిపిన్ రావత్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్‌తో ప్రయాణిస్తున్న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కూలిపోయింది. సిడిఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, ఆయన సిబ్బంది, ఇతర అధికారులు ఈ హెలికాఫ్టర్ లో ఉన్నారు.
ఈరోజు తెల్లవారు జామున తమిళనాడులోని నీలగిరిలో కూలిపోయిన మిలటరీ హెలికాప్టర్‌తో పాటు మరో 13 మందితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు.

2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో హెలికాఫ్టర్ క్రాష్
డిసెంబరు 31 2019న భారతదేశపు మొదటి సిడీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రావత్ ఒకప్పుడు ఛాపర్ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో చీతా ప్రమాదం నుంచి రావత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్ గా పని చేస్తున్నారు.
2015లో దిమాపూర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో దిమాపూర్‌లో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే చాపర్ కూలిపోయింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరియు ఒక కల్నల్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. జనరల్ రావత్ కు అప్పుడు స్వల్ప గాయాలయ్యాయి.

స్వల్ప గాయాలతో బయటపడ్డ బిపిన్ రావత్
హెలికాప్టర్
20
మీటర్లు
పైకి
ఎగరకముందే
అదుపు
తప్పి
కూలిపోయింది.
నీలగిరిలో
ప్రమాదం
జరిగిన
తర్వాత,
తమిళనాడులోని
కూనూర్
సమీపంలో
సిడీఎస్
జనరల్
బిపిన్
రావత్‌తో
కూడిన
IAF
Mi-17V5
హెలికాప్టర్
ఈరోజు
ప్రమాదానికి
గురైందని
భారత
వైమానిక
దళం
తెలిపింది.
ప్రమాదానికి
గల
కారణాలను
తెలుసుకునేందుకు
విచారణకు
ఆదేశించారు.
ఈ
ఘటనలో
పదకొండు
మంది
మృతి
చెందగా,
ముగ్గురు
ఆస్పత్రిలో
చికిత్స
పొందుతున్నారు.

హెలికాఫ్టర్ క్రాష్ లో మరణించిన 13 మంది .. బిపిన్ రావత్ పై వెలువడని ప్రకటన
హెలికాప్టర్ విల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీకి వెళుతుండగా, సూలూర్‌లోని ఆర్మీ బేస్ నుండి Mi-సిరీస్ ఛాపర్ బయలుదేరిన కొద్దిసేపటికే నీలగిరిలో క్రాష్ జరిగింది.
ఇలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో బుధవారం ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారని సమాచారం. ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ సహా మొత్తం మీద దీనిలో 14 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో 13 మంది మరణించినట్టు సమాచారం . బిపిన్ రావత్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.