• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బొంబాయిలో అంతే ..! డ్రైనేజీలో కోటీశ్వరుడు !

|

ముంబై: కాళ్లకైనా, కార్లకైనా సడక్ ఒక్కటే, పారిశుద్ధ్య కార్మికులకైనా, కోటీశ్వరులకైనా మ్యాన్ హోల్ ఒక్కటే.. అని నిరూపించిన ఘటన ఇది. ఖరీదైన కారును పార్క్ చేసి, రోడ్డు మీద నడుచుకుంటూ షాపింగ్ మాల్ కు వెళ్లారో కోటీశ్వరుడు. అలాంటిలాంటి కోటీశ్వరుడు కాదు. సింగపూర్ ప్రధాన కేంద్రంగా, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న హీలియస్ క్యాపిటట్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. పేరు సమీర్ అరోరా.

Helios Capital boss Samir Arora slips into open Mumbai manhole

నడుచుకుంటూ షాపింగ్ మాల్ కు వెళ్లడంలో విశేషమేమీ కాదు. చెప్పుకోదగ్గ వార్త కాదు గానీ.. అలా వెళ్తూ, వెళ్తూ తెరచి ఉన్న మ్యాన్ హోల్ లో దభేల్ మంటూ పడిపోయారు. మ్యాన్ హోల్ ఎలా ఉంటుందో తెలుసుగా! మానవ వ్యర్థాలతో నిండుగా ఉన్న మ్యాన్ హోల్ లో అది. అరోరా పడిపోయిన దృశ్యాన్ని చూసిన వెంటనే.. స్థానికులు స్పందించారు. ఆయనను పైకి లాాగారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోయర్ పరేల్ ప్రాంతంలోని ఫీనిక్స్ మిల్స్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాన్ హోల్ లు మానవ వ్యర్థాల మధ్య ఛాతీ వరకు ఆయన కూరుకుపోయారు.

తాను మ్యాన్ హోల్ లో పడిపోయిన విషయాన్ని సమీర్ అరోరా.. ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని సెకెన్ల పాటు తన కళ్ల ముందు ఏమీ కనిపించలేదని అన్నారు. ఛాతీ వరకు మానవ వ్యర్థాలతో నిండి పోయిన జలాల్లో కూరుకుపోయానని, స్థానికులు తనను రక్షించారని చెప్పుకొచ్చారు. దుర్గంధాన్ని భరించలేకపోయానని, నరకం కనిపించిందంటూ ఆయన ట్వీటారు. మ్యాన్ హోల్ లో పడ్డప్పుడు తన ఖరీదైన మొబైల్ ఫోన్ అందులోనే ఉండిపోయిందని, బృహన్ ముంబై కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు దొరికతే.. తన కానుకగా ఉంచుకోవచ్చని అన్నారు. ఓ రకంగా తనకు మ్యాన్ హోల్ పునర్జన్మ ఇచ్చిందని చెప్పారు. మ్యాన్ హోళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్థానికులకు సూచించారు.

Helios Capital boss Samir Arora slips into open Mumbai manhole

ఈ ఘటనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. సమీర్ అరోరా ట్వీట్ ను చూసిన వెంటనే అక్కడి అధికారులు.. ఆ మ్యాన్ హోల్ పై మూతను ఏర్పాటు చేశారు. మూసివేసిన మ్యాన్ హోల్ ఫొటో తీసి, దాన్ని అరోరాకు రీట్వీట్ చేశారు.

వర్షాకాలం సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాన్ హోళ్లు ప్రాణాంతకమే. పలువురు పాదాచారులను మింగేసిన ఘనత మ్యాన్ హోళ్లకు ఉన్నాయి. హైదరాబాద్ లో ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ మ్యాన్ హోల్ లో పడి ప్రాణాలను కోల్పోయిన విషయం గుర్తుండే ఉంటుంది. 2017లో ముంబైలో ప్రముఖ డాక్టర్ ఒకరు మ్యాన్ హోల్ లో పడి దుర్మరణం పాలయ్యారు. రెండు రోజుల తరువాత ఆమె మృతదేహం చాదర్ ఘాట్ వద్ద నాలాలో తేలింది. వర్షపు నీరు నడిరోడ్డును ముంచెత్తిన సమయంలో.. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందనే విషయం ఎవరికీ తెలియదు. హడావుడిగా వెళ్తూ, అందులో పడి చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు.

English summary
Top-notch fund manager Samir Arora had a narrow escape after he slipped and was subsequently rescued from an open manhole near a shopping mall in Mumbai this week. The founder of Helios Capital took to Twitter to describe the incident and also borrowed from the popular Mohd Rafi tune “Yeh hai Bombay Meri Jaan” to suggest that the city was close to taking his ‘jaan’ (life). Responding to a tweet from his friend Neeraj Batra, who first shared the incident outside Phoenix Mills Mall at Lower Parel, Arora said he was ‘within microseconds of disappearing’ but ‘quick reflexes and shape of manhole gave me a second life’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more