వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హలో..నేను యోగిని మాట్లాడుతున్నా, ఫోన్ ఎత్తకపోతే వేటే: యూపీ సిఎం

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజంగానే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. హడలెత్తిస్తున్నాడు. ఉన్నతాధికారుల నుండి కిందిస్థాయి ఉద్యోగులకు సైతం ఆయన హెచ్చరికలను జారీ చేస్తున్నాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజంగానే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. హడలెత్తిస్తున్నాడు. ఉన్నతాధికారుల నుండి కిందిస్థాయి ఉద్యోగులకు సైతం ఆయన హెచ్చరికలను జారీ చేస్తున్నాడు.

ముఖ్యమంత్రి ఏ సమయంలోనైనా ఫోన్ చేసే అవకాశం ఉందని ఫోన్ ఎత్తి మాట్లాడకుండా కారణాలతో తప్పించుకోవాలని చూస్తే వేటు తప్పదు.

అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుండి రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిపాలనను గాడిలో పెట్టడం కోసం కృషి చేస్తున్న యోగి అధికారులకు ఫోన్ లు చేసీ మరీ ఆరా తీస్తున్నారు.

Hello, It's Yogi Adityanath: Officers Warned He'll Call On Landline Too

దీంతో ఉన్నతాధికారులు ఏకంగా నోటీసు బోర్డుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య సీఏం ఏ సమయంలోనైనా ఫోన్ చేసే అవకాశం ఉందని వెంటనే ఎత్తి సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆదేశాలు జారీచేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి తరుపున శ్రీకాంత్ శర్మ అనే సీనియర్ మంత్రి జారీ చేయగా దానిని అనుసరిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసులు వెలిశాయి. గతంలోనే రోజుకూ ప్రతి అధికారి 18 నుండి 20 గంటలు పనిచేయాలని ఆదేశించారు యోగి.

English summary
Yogi Adityanath is covering all bases to ensure that government and other officials are working around the clock to improve law and order and governance - both historically problematic - in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X