• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండేళ్ల చిన్నారికి గుండె సంబంధిత వ్యాధి... దాతల కోసం తల్లి ఎదురుచూపులు..!

ఇదో కుటుంబం దీన గాథ. తమిళనాడులో నివాసం ఉంటున్న షణ్ముగం మరియు సత్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. సత్య షణ్ముగంలకు పెళ్లి అయినప్పటి నుంచి ఏదో రకంగా కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కుటుంబం పోషణ కోసం షణ్ముగం ఒక భవన నిర్మాణ కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేసేవాడు. ఒకవేళ పనిభారం ఎక్కువైతే దాన్ని పక్కనపెట్టి మార్కెట్‌లో లోడ్ ఎత్తేందుకు వెళ్లేవాడు. అలా వచ్చిన డబ్బులతోనే వారి కుటుంబం గడిచేది.

ఇక కుటుంబం పోషించడంలో సత్య కూడా తన వంతు పాత్ర పోషించేది. టైలరింగ్‌ వచ్చి ఉండటంతో ఇరుగుపొరుగు వారి బట్టలు కుడుతూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉండేది. అలా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. భార్యా భర్తల మధ్య గొడవలు తలెత్తడంతో సత్య తన పిల్లలను తీసుకుని తన తల్లి దగ్గరకు చేరింది.

ఇక సత్య కూడా పూర్తిగా ఆరోగ్యవంతురాలు కాదు. ఆమె కర్ర సహాయం లేనిదే నడవలేదు. ధర్మపురిలో 8వ తరగతి వరకు సత్య చదువుకుంది. ఆ సమయంలోనే కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో మోకాలు తర్వాత ఆ కాలును తీసేయాల్సి వచ్చింది. ఇక కర్ర సహాయం లేనిదే ఆమె అడుగు ముందుకు వేయలేదు. ఈ క్రమంలోనే ఆమెకు షణ్ముగంతో వివాహమైంది.

ఇద్దరు కలిసి ఉన్న సమయంలో కుంటుంబాన్ని కలిసి పోషించుకునేవారు. ప్రస్తుతం వేరుగా ఉండటంతో సత్య ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. తన రెండేళ్ల కూతురు బృంద గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పుట్టుకతోనే ఈ సమస్య వచ్చింది. అప్పుడు అంత తీవ్రత ఉండేది కాదు కానీ.. క్రమంగా పెరిగే కొద్దీ ఈ సమస్య జటిలంగా మారింది. పక్కటెముకలు శరీరంలోపలే పెరుగుతుండటంతో గుండె, ఊపిరితిత్తులు బిగించుకుపోతున్నాయి.

దీంతో చిన్నారి బృంద సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో మరిన్ని ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చాయి. పక్కటెముకలు లోపలే పెరుగుతుండటంతో గుండె, ఊపిరితిత్తులు బిగుసుకుపోతున్నాయి. దీంతో ఆమె ఆహారం చాలా తక్కువగా తీసుకుంటోంది. ఆ చిన్నారిని హాస్పిటల్‌లో వైద్యులకు చూపించగా పెక్టస్ ఎక్స్‌కావాటం, ఎడమ ఊపిరితిత్తులో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

పెక్టస్ సమస్య తొలగాలంటే సర్జరీ చేయాలని అదే సమయంలో ఊపిరితిత్తులను కూడా సరిచేయాలంటే సర్జరీ అవసరమని వైద్యులు చెప్పారు. అయితే అందుకు బాగా ఖర్చు అవుతుంది. అంత డబ్బలు సత్య దగ్గర లేవు. దీంతో తన కూతురును బతికించుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురు చూస్తోంది.

సత్య కూతురు బృందకు విరాళం రూపంలో సహాయం చేయాలనుకునేవారు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ పే, అమెజాన్ పే ఇలా డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా డబ్బులు విరాళంగా ఇవ్వొచ్చు. సత్య కూతురు బృందను కాపాడే బాధ్యతను తీసుకుందాం. తిరిగి చిరునవ్వుతో ఇంటికి వచ్చేందుకు మనవంతు సహాయం చేద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X