వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలల నిండక ముందే పుట్టిన మా బాబు ప్రాణాలు కాపాడేందుకు సాయం చేయండి

Google Oneindia TeluguNews

"నేను మా బాబును మొదటగా చూసినప్పడు నా కళ్లలో ఆనందబాష్పాలు కదిలాయి. నా ప్రెగ్నెన్సీ చాలా కష్టంగా గడిచింది. కానీ వాణ్ని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు నా బాధ మొత్తం పోయింది. " అంటూ ఏడుస్తూ చెప్పింది లక్ష్మి. ఆ తల్లి ప్రస్తుతం తన ప్రీమెచ్యూర్ బేబీని కాపాడుకోటానికి అష్టకష్టాలుపడుతుంది.

లక్ష్మీ తన బాబును చూసుకుని మురిసిపోయింది. కానీ ఆ ఆనంద కొన్ని క్షణాలు కూడా ఉండలేదు. ఆ బాబు ఇప్పుడు వెంటిలేటర్ పై ఉన్నాడు. తను మళ్లీ మామూలు పరిస్థితికి తీసుకురావడానికి చాలా కష్టాలు పడుతున్నారు.

Help baby of Lakshmi, who is unhelathy. Help Lakshmi to save her newborn.

ఇది లక్ష్మికి మొదటి కాన్పు. ఆమె, ఆమె భర్త తమ బాబుతో ఆనందంగా ప్రతి క్షణం గడుపుదామనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. లక్ష్మి భర్త సెల్ ఫోన్ రిపేర్ షాప్‌లో పని చేస్తాడు. పుట్టబోయే బిడ్డ కోసం ఓవర్ టైమ్ చేసి ఎంతో కొంత మొత్తాన్ని తీసిపెడదామనుకున్నాడు.

లక్ష్మి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తన భార్య కోసం పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ సమకూర్చాలని ప్రయత్నించారు ఆమె భర్త. పెద్దగా ఆదాయం లేకపోయినా బాబు కోసం తగినంత పొదుపు చేసేవారు. కుటుంబంపై ప్రేమతో అదనంగా వచ్చే డబ్బు కోసం ఎక్కువ సేపు పనిచేసేవారు. పొద్దున్నే లేచి షాపును తొందరగా తెరిచేవారు. అర్థరాత్రి వరకూ పనిచేసేవారు. అసలు విరామం లేకుండా కష్టపడ్డారు. అదంతా బాబు కోసమే.

Help baby of Lakshmi, who is unhelathy. Help Lakshmi to save her newborn.

"మాకు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కానీ బాబు విషయంలో ఆయన అవేవీ రానివ్వకుండా మా ఆయన కష్టపడ్డాడు. తాను తండ్రి కాబోతున్నాననే ఆనందంలో మా కోసం చాలా కష్టపడ్డారు." అంది లక్ష్మి.

"నా భర్త రాత్రీ పగలూ పనిచేసి ఇంటికొచ్చి, నన్నూ, బాబును చూసుకునేవారు. సమయం కష్టంగా గడుస్తున్నా ఆయన పని, కుటుంబానికి మధ్య బ్యాలెన్సు తప్పలేదు. అన్నివేళలా మాకు ఆయనే అండగా ఉండేవారు" అంటూ లక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రసవ సమయానికి ముందే డెలివరీలు సహజమే. కానీ కొన్ని కేసులలో, బేబీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. లక్ష్మి బాబు విషయంలో కూడా అదే జరిగింది. లక్ష్మి తన సమస్యల్ని ఇలా చెప్పింది.. "నా ప్రెగ్నెన్సీ మొదటి నెలలు చాలా నల్లేరు మీద నడకలా హాయిగా గడిచిపోయాయి. మా ఇంట్లో వాళ్లంతా బిడ్డ ఎప్పుడు పుడతారా అని ఎదురు చూశారు. కానీ విధి మరో రకంగా మాతో ఆడుకుంది. కొన్ని పరిస్థితుల వల్ల నేను ప్రసవ సమయానికన్నా ముందే పురుటి నొప్పులతో బాధపడ్డాను. నాకు బాబు నెలలు నిండక ముందే పుట్టాడు."

Help baby of Lakshmi, who is unhelathy. Help Lakshmi to save her newborn.

"నేను బాబును సరిగ్గా చేతుల్లోకి తీసుకోకముందే డాక్టర్లు ఏవో పరీక్షలు చేయాలంటూ దూరంగా తీసుకెళ్ళారు. వారికి బేబీలో ఏదో సరిగ్గా అన్పించలేదు. కొద్దిసేపయ్యాక మా బాబు ప్రీమెచ్యూర్ జననలోపంతో బాధపడుతున్నాడని నాకు తెలిసింది. వాడు సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతుండటంతో వెంటిలేటర్ పై ఉంచారు."

"నాకు ఎంతో కష్టంగా ఉంది మా బాబును ఇలా బాధపడుతూ చూడటం. నా బిడ్డ ప్రతీరోజూ జీవితం కోసం పోరాడటం చూసి నాకెలా ఉందో ఎవరూ ఊహించలేరు కూడా. వాడు ఇంకా వెంటిలేటర్ సాయంతోనే ఉన్నాడు. ఇప్పుడు తీవ్రమైన కాల్షియం లోపం కూడా మొదలైంది. నియోనేటల్ ఫిట్లు కూడా వస్తుండటంతో నియంత్రణలేకుండా వాడి శరీరం వణికిపోతుంది.నేను బాబు బాగవ్వాలని ఎంతో ప్రార్థిస్తున్నాను. మా మొదటి బాబుని కేవలం డబ్బు సాయంతోనే ప్రాణాన్ని నిలబెట్టగలం. కానీ మా వద్ద అదే లేదు " అంటూ ఆమె ఏడ్చారు.

బేబీ ఎన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. దానికి వారికి రోజుకి 25,000 రూపాయలు ఖర్చవుతోంది. నెల రోజుల నుంచి బాబు హాస్పిటల్లో ఉన్నాడు. లక్ష్మి, ఆమె భర్త ఇప్పటికే చికిత్స కోసం 12 లక్షలు ఖర్చుచేశారు. "మేము అనుక్షణం బాబు ప్రాణం గురించి ఆందోళన చెందటమేకాకుండా, ప్రతీరోజూ బిల్లులు కట్టటానికి డబ్బులు కూడా వెతుక్కునే పరిస్థితి. మా సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి, డబ్బు సకాలంలో సమకూర్చలేకపోతే, బేబీ చికిత్స కూడా ఆపేయాల్సి వస్తుంది," అంటూ బోరుమంటూ బాధపడింది ఆ తల్లి.

ఈ కుటుంబానికి తమ బాబు చికిత్స కోసం మరో 8 లక్షలు కావాలి, అందువల్ల ఫండ్ రైజర్ మొదలుపెట్టారు.

"మా బాబును ఎంత వీలైతే అంత తొందరగా ఇంటికి తీసుకువెళ్లి పోవాలని అనుకుంటున్నాం. వాడిప్పటికే చాలా నరకం అనుభవించాడు, వాడిని మళ్ళీ ఆరోగ్యంగా పెంచుకోవాలని ఆశపడుతున్నాం. నేను మీ అందరినీ మా బాబుకి, కుటుంబానికి మాకు అవసరమైనంత మొత్తంతో సాయపడండని బతిమిలాడుకుంటున్నాను. మా బాబు బతికేలా సాయపడండి. మా బాబు జీవితంలో మరలా వెలుగును నింపండి. నేనూ, నా భార్య లక్ష్మి జీవిత కాలం పాటు మీ సాయానికి రుణపడివుంటాం. దయచేసి మా బాబుని ప్రాణాలతో కాపాడండి." అంటూ వేడుకుంటున్నారు బాబు తండ్రి. మానవత్వాన్ని రక్షించటానికి, సాయపడటానికి మనందరం చేతులు కలుపుదాం. మీ నుంచి వచ్చే ఎంత మాత్రం సాయమైనా బేబీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. లక్ష్మికి తన బిడ్డను రక్షించుకునేలా సాయం చేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X