వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నామృత మధ్యాహ్నభోజన పథకం: మీ విరాళంతో పిల్లల ఆకలిని తీర్చండి

Google Oneindia TeluguNews

శ్యామ్ 9 సంవత్సరాల బాలుడు. అతని తండ్రి పండ్ల దుకాణం నిర్వహిస్తుంటాడు. ఒక సాధారణ వ్యాపారి అతను. శ్యామ్ 5 నెలలు చదువుకుంటే, మిగిలిన సమయంలో పనికి వెళ్ళాల్సిన పరిస్థితి. అంతేకాదు శ్యామ్ వాళ్ల నాన్న వ్యాపారం కొనసాగించడానికి కుటుంబాన్ని తరచుగా అనేక స్థలాలకు తరలిస్తూ ఉంటాడు.

విరాళాలు అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అయితే శ్యామ్, అతని సోదరి పాఠశాలలో చేరారు. అదృష్టవశాత్తు, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కూడా అమలులో ఉంది. క్రమంగా వారు పాఠశాల విద్యతో పాటు, ఒక పూట భోజనం తినే వెసులుబాటు కలిగింది. ఈ పథకం ఆ కుటుంబానికి కూడా ఆసరా అయ్యింది. ఇప్పుడు శ్యామ్, అతని సోదరి ఇద్దరూ సంతోషంగా పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పథకం ద్వారా ఆ కుటుంబానికి కొంత మేర ఆర్థిక సమస్యలు కూడా తగ్గాయి.

భారతదేశం భిన్న మతాలు, సంస్కృతి భాషా వైవిధ్యంతో కూడుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించే లౌకికవాదాన్ని అనుసరిస్తూ ఇతర అన్ని దేశాలకన్నా ఉత్తమమైనదిగా కీర్తించబడుతుంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా పేరెన్నికగన్నది కూడా. 2018 లో, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. గత రెండు సంవత్సరాలుగా చైనాతో పోలిస్తే జిడిపి వృద్ధిరేటులో భారత్ ముందుకు దూసుకుని వెళ్తూ కనిపిస్తుంది.

 Help Children By Contributing To Annamrita

అంత గొప్ప అభివృద్ధి ఉన్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ, ఆర్ధిక పరిస్థితికి పూర్తి వ్యతిరేకంగా ఆకలితో నిశ్శబ్ద పోరాటం కొనసాగిస్తోంది అంటే ఆశ్చర్యం కలుగక మానదు. భారతదేశం గత 25 సంవత్సరాలుగా మెరుగైన దిశలో పయనిస్తున్నప్పటికీ, పాకిస్థాన్ మినహా, మిగిలిన పొరుగుదేశాలతో పోలిస్తే ఎక్కువ ఆకలి కేకలకు మనదేశం నిదర్శనంగా నిలుస్తూ ఉంది.

ఆకలిని నిర్మూలించే క్రమంలో, పిల్లల ప్రాథమిక పోషక అవసరాలను అందించే ఉత్తమ లక్ష్యంతో 1995 లో ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం ద్వారా, ప్రభుత్వ, ప్రభుత్వ ఆధారిత ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పిల్లలకు, తాజాగా వండిన ఆరోగ్యకరమైన భోజనం సరఫరా చేయబడుతుంది. యూనిసెఫ్ ప్రకారం, ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమాలన్నీ దాదాపు 60 మిలియన్ మంది పిల్లలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. వారిలో చాలామంది కింద చెప్పిన పరిస్థితులతో బాధపడుతున్నారట.

● 50% తక్కువ బరువు,
● 45% పెరుగుదల లోపాలు (వయస్సు కన్నా, తక్కువ ఎత్తు కలిగిన),
● 20% పూర్తిస్థాయి బలహీనత (తీవ్రమైన పోషకాహార లోపాన్ని సూచిస్తున్నట్లుగా, వారి ఎత్తుకు, సన్నదనానికి సంబంధం లేకుండా)
● 75% రక్తహీనత, 57% విటమిన్ ఎ లోపంతో బాధపడుతున్నారు.

 Help Children By Contributing To Annamrita

అటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల పరిస్థితులకు కారణం ఎవరు ?

తమ పిల్లలకు సరైన భోజనం పెట్టలేని స్థితిలో తల్లిదండ్రులు బతుకు బండిని ఈడుస్తున్నారా? లేదా, ప్రభుత్వం కొన్ని వందల కార్యక్రమాలు ప్రారంభించినా ప్రజల ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య, ఆహార అవసరాలను సైతం పూర్తి స్థాయిలో తీర్చలేనివిగా ఉన్నాయా?

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గలిగిన దేశంగా పేరొందిన భారతదేశంలో ప్రతి శిశువుపై సరైన శ్రద్ధ వహించడం అంటే అత్యంత క్లిష్టమైన అంశంగా పేర్కొంటున్నారు మేధావులు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇస్కాన్ వారి ఎటువంటి లాభాపేక్షలేని, మత పరం కాని, నాన్-సెక్టారియన్ పబ్లిక్ ఛారిటబుల్, స్వచ్చంద ఆహార సంస్థ అయిన అన్నామృతద్వారా, ప్రభుత్వ, ప్రభుత్వ ఆధారిత ప్రాధమిక, ఉన్నత పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది. క్రమంగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని, వంటశాలల నుంచి తాజా వంటకాలతో ప్రతిరోజు 1.2 మిలియన్ భోజనాల పంపిణీ జరుగుతూ ఉంది.

ఈ సంస్థ పిల్లలకు తాజాగా వండిన భోజనం అందివ్వడమే కాకుండా, వారి శరీరానికి అవసరమైన పోషక అవసరాలను తీర్చడం కూడా తమ బాధ్యతగా స్వీకరించింది. క్రమంగా పిల్లలను పాఠశాలలకు హాజరయ్యేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. అనేకమంది గృహాలలో సరైన సమయానికి, సరైన భోజనం కూడా అందివ్వలేని పరిస్థితులు నెలకొంటుంటాయి. అటువంటి పిల్లలకు, ఈ మధ్యాహ్న భోజనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సమయానికి రుచికరమైన పౌష్టిక ఆహారం కారణంగా, పిల్లలు కూడా చురుగ్గా తమ తరగతులకు హాజరయ్యేలా ప్రేరణనిస్తుంది.

 Help Children By Contributing To Annamrita

ఇప్పటివరకుగల ఫలితాలు

2004 నుంచి అన్నామృతదేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. క్రమంగా అత్యత్తమ ఫలితాలను పొందడం జరిగింది. "మా అనుభవం ప్రకారం, మా సంస్థ ద్వారా ఆహారాన్ని తీసుకునే పిల్లలు, తెలివైన వారిగా పరీక్షల్లో ఉత్తమ మార్కులను సాధించే వారిగా ఉన్నారు, పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పెరుగుతూ వచ్చింది కూడా, క్రమంగా వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయగలుగుతున్నాం" అని గోపాల్ కృష్ణ గోస్వామి, ట్రస్టీ- బీబీటీ, ఇస్కాన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ప్రశంసించారు.

'అన్నామ్రిత' అనగా 'అమృతం వంటి స్వచ్ఛమైన ఆహారం' అని అర్ధం. ఇస్కాన్ స్వచ్ఛంద ఆహార సంస్థ అయిన అన్నామ్రిత, పేద పిల్లలకు తల్లిలా మారి, ఆరోగ్యకరమైన తాజా పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అందుకే దీన్ని "అన్నామ్రిత" అంటున్నారు. పిల్లలకి సాత్వికమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో "అన్నామ్రిత" ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.

అనేక మంది పిల్లలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందుతున్నప్పటికీ, ఇంకా ఈ పథకం ద్వారా లబ్ది పొందాల్సిన విద్యార్థులు చాలామందే ఉన్నారు. అటువంటి పిల్లలందరికీ "అన్నామృత" చేరుకునే క్రమంలో సహాయం అందించేందుకు, మీ సహకారం అవసరం. మీ నుంచి వచ్చే చిన్నసహకారం కూడా వారి చిన్ని చిన్నికడుపులను నింపేందుకు ఎంతగానో సహకరిస్తుందని మరువకండి.

విరాళాలు అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X