వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నామృత మధ్యాహ్న భోజన పథకం: మిలియన్ల మంది పసిపిల్లలకు సాయాన్ని అందించండి

Google Oneindia TeluguNews

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు దైనందిక జీవితంలో భాగంగా ఆకలితో పోరాడుతున్నారు. ఆకలితోనే బతుకుతున్నారు. జ్యోతి కుటుంబం కూడా అలాంటి దుర్భర జీవితాన్ని గడుపుతున్న కుటుంబాల్లో ఒకటిగా ఉంది. గురూగ్రాంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్యోతి. ఆమె తండ్రి రోజువారీ వేతనం కింద పనిచేసే కార్మికుడు. ఆమె తల్లి ఇళ్ళల్లో పని చేస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలోని ముగ్గురు మూడు పూటల భోజనం కూడా సరిగ్గా చేయలేని దీనపరిస్థితి. పస్తులు అనేవి వారికి నిత్యకృత్యం. కానీ జ్యోతి పాఠశాలలోనే ఇస్కాన్ వారి అన్నామ్రిత మధ్యాహ్న భోజన పథకం కారణంగా, రోజులో కనీసం ఒకపూట రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తినగలుగుతుంది.

ఇక్కడ క్లిక్ చేసి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు సాయం చేయండి

అలా మధ్యాహ్న భోజన పథకంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని ఆస్వాదించడానికి జ్యోతి వంటి అనేక మంది పిల్లలు అదృష్టవంతులుగా ఉన్నారు. అయితే రోజు రోజుకూ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆకలిని ఓడించే ఇటువంటి కార్యక్రమాల గురించి అనేక మందికి అవగాహన కూడా లేదు. అప్పటికీ, అవసరంలో ఉన్న అందరు పిల్లలకు ఈ పథకం అందేలా, వారి కడుపులు నిండేలా, అన్నామృత కృషి చేస్తూనే ఉంది. ఈ అక్టోబరు 16, 2018 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా, "నేటి మన చర్యలే రేపటి మన భవిష్యత్తుకు పునాదులు" నినాదంతో, అందరం చేతులు కలిపి, సరైన దిశలో పని చేస్తే, "జీరో హంగర్ వరల్డ్" 2030 నాటికి సాధ్యమవుతుంది.

Help Children By Contributing To Annamrita

1945 లో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) స్థాపన సందర్భంగా, గౌరవసూచకంగా ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం అనేది ఆకలి సమస్యకు వ్యతిరేకంగా నిర్వహించుకునే రోజు. అనేక దేశాలలో ఇప్పటికీ ఆకలి చావులు ఉన్నాయి. సరైన దిశలో ఆకలిని నిర్మూలించడానికి సరైన చర్యలు అవసరమవుతాయి. ఆకలి సమస్యను సమూలంగా నిర్మూలించడానికి అందరి సహకారం అవసరం. అలా చేస్తేనే 2030 నాటికి ఆకలి సమస్యను తరిమికొట్టి, పోషకాహార లోపాన్ని అంతం చేయడానికి సాధ్యపడుతుంది.

Help Children By Contributing To Annamrita

వ్యవసాయం మన దేశంలోని ప్రధాన వృత్తులలో ఒకటిగా ఉన్నప్పటికీ, భారత దేశంలోని వ్యవసాయం చేసే రైతు కుటుంబాలు సైతం ప్రధానంగా ఆకలి సమస్యలతో బాధపడుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాల పెరుగుదల, ఉత్పత్తిని ప్రభావితం చేసేలా పర్యావరణ మార్పులు కొన్ని భారత ఆర్థిక పరిస్థితుల ప్రభావాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, ఆకలి అనేది మొత్తం వ్యవస్థను ప్రభావితం చేస్తూ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నేరుగా కనపడకపోయినా, ఆకలి అనేది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది అనేది జగమెరిగిన సత్యం.

"మన చర్యలే మన భవిష్యత్తు", అన్న నినాదంతో ముందుకు వస్తున్న ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ (అన్నామ్రిత) ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా భారత దేశం పిల్లల ఆకలి సమస్యతో పోరాడటానికి, ఒక ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించే క్రమంలో భాగంగా ప్రతిజ్ఞ పూనింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని 20 వంటశాలల ద్వారా, ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్, ప్రస్తుతం ప్రతిరోజూ 1.2 మిలియన్ల భోజనాలను పిల్లలకు అందిస్తోంది.

తాజా FAO 2018 రాష్ట్ర ఆహార, పోషకాహార భద్రత నివేదిక ప్రకారం, 820 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక పోషకాహార లోపాలతో బాధపడడమే కాకుండా, పిల్లల్లో ప్రతి 5 సెకన్లకు ఒకరు మృత్యువాత పడుతున్నారని తేల్చింది. మనం ఇప్పుడు సరైన చర్యలు తీసుకోనకపోతే, ఇంకెప్పుడు తీసుకుంటాం చెప్పండి.

Help Children By Contributing To Annamrita

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్న 150 కన్నా ఎక్కువ దేశాలతో పాటు, ఆకలి, పోషకాహార సమస్యను రూపుమాపేందుకు అన్నామ్రిత ప్రజలందరిని భాగస్వాములను చేయడానికి, క్రమంగా దేశంలోని ఆకలి సమస్యల గురించిన అవగాహనను కల్పించడానికి పిలుపునిస్తూ ఉంది. అందరూ చేతులు కలిపితే "జీరో హంగర్ వరల్డ్" కచ్చితంగా సాధ్యమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X