వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నామృతకు డొనేషన్ అందించి చిన్నారుల ఆకలిని తీర్చడానికి సహకరించండి

Google Oneindia TeluguNews

మీనాక్షి 9ఏళ్ల అమ్మాయి. తన స్నేహితులతో కలిసి ఆడుకోవడం అంటే తనకు ఎంతో ఇష్టం. కానీ మీనాక్షి తల్లి లక్ష్మీ ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వారాంతాలు కూడా లేకుండా కష్టపడుతూ కుటుంబాన్ని నడిపిస్తుంది. కొన్ని సందర్భాలలో, యజమానులు ఇచ్చిన ఆహార పదార్ధాల మీదనే ఆ కుటుంబం ఆధారపడాల్సి వస్తుంది. వారికి పస్తులు అనేవి సర్వసాధారణం.

ఇలాంటి చిన్నారులకు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Help children by contributing to Annamrita programme

లక్ష్మి, ఒక తల్లిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే,వృత్తి పరంగాప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటుంది. తల్లికి పని బాగా ఎక్కువగా ఉండడంతోమీనాక్షి తన తల్లికి రోజూ సహాయపడుతూ ఉంటుంది. పాఠశాలలకు వెళ్ళటానికి కూడా సమయం లేక, తన బాల్యాన్ని కోల్పోతూ ఉంది. క్రమంగా ఆడుకుంటూ సరదాగా గడిచిపోవాల్సిన బాల్యం, ఇంటి పనులకు అంకితమైపోతూ ఉంది. ఇక్కడ తప్పు ఎవరిది ? మీనాక్షిదా ? లేక ఆమె తల్లిదా ? రెండూ కాదు. వారి ఆర్థిక స్థితిగతులవి. నిజమేకదా.

Help children by contributing to Annamrita programme

కానీ ఆమె అదృష్టానికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. లక్ష్మి యజమానులలో ఒకరు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ (NCLP) తో సంబంధం కలిగి ఉన్న కారణంగా, ఆమె పరిస్థితి గురించి NCLP టీమ్ కు తెలిపారు.ఇప్పుడుమీనాక్షి ఒక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అలాగే రోజువారీ పనులకు స్వస్తి చెప్పి, తన కొత్త స్నేహితులతో ఆటాపాటల మద్య పాఠశాలకు వెళ్తూ ఉంటుంది. తన బాల్యాన్ని ఆస్వాదించగలుగుతూ ఉంది. దీనంతటికీ గల ప్రధాన కారణం, అన్నామృతా మధ్యాహ్న భోజన పథకం. అన్నామృత అందించే రుచికరమైన మధ్యాహ్న భోజనం ఆమె కష్టాలకు అండగా నిలిచింది. ఈ మధ్యాహ్న భోజనం ఆమె రోజువారీ పోషక అవసరాన్ని తీరుస్తూ, ఆమె తల్లి పనిభారానికి ఉపశమనంగా నిలిచింది. లక్ష్మీ ఇప్పుడు సాయంత్రానికల్లా, పనిని పూర్తిచేసుకుని, తన విలువైన సమయాన్ని కుమార్తెతో గడిపేందుకు కూడా వీలు కలిగినందుకు ఎంతగానో సంతోషిస్తుంది. మీనాక్షికి ఏదో ఒక రోజు ఉపాధ్యాయురాలిగా మారాలనే కోరిక బలంగా ఉంది. క్రమంగా తన తల్లికి పనిభారం తగ్గించి, తనకు ఉపశమనం ఇవ్వాలని కలలు కంటుంది. అన్నామృతా అటువంటి వేలమంది పిల్లలను ఆదుకుంటోంది. వారి పేదరికం పిల్లలకు శాపంగా పరిణమించకుండా అండగా నిలుస్తుంది.

Help children by contributing to Annamrita programme

మీనాక్షి వంటి అనేక మంది పిల్లలు బాల కార్మికుల గొలుసులలో చిక్కుకుని ఉన్నారు. వారి కుటుంబాలకై రోజువారీ అవసరాలను తీర్చే క్రమంలో ఆ చిన్ని చేతులకు తీవ్రమైన పనిభారాన్ని అందిస్తున్నారు. అటువంటి పిల్లలు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ కింద పాఠశాలల్లో చేరడం జరుగుతూ ఉంది. మేము అన్నామృతాలో భాగంగా, ఈ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాము. కొందరి ఇళ్లల్లో ఆ పసిపిల్లలకు, ఇదే ప్రధాన భోజనం, లేక ఏకైన భోజనంగా కూడా ఉంది అంటే ఆశ్చర్యం కలగకమానదు.

Help children by contributing to Annamrita programme

ఈ పిల్లలకు మీ సానుభూతి అవసరం. నేటి బాలురే రేపటి పౌరులు అంటారు. కానీ బాల్యమే అగమ్యగోచరం అయితే, రేపటి భవిష్యత్తు అంధకారమే కదా. కావున వీరికి సహాయం అందించడంలో మీరు కూడా అడుగు ముందుకు వేయండి.

Help children by contributing to Annamrita programme

"భారతదేశంలోని పసిపిల్లలు, ఆకలి కారణంగా విద్యను కోల్పోరాదు",అన్న నినాదంతో ముందు సాగుతున్న అన్నామృతా, వారికి రుచికరమైన పోషకాహారాన్ని అందిస్తూ, వారి బాల్యానికి భారోసానిస్తూ ఉంది. ఇప్పుడు మీ వంతు!! ఒక క్షణం ఆలోచించి ఈ పసి పిల్లలకు మీ ఆపన్న హస్తాన్ని అందించండి. ఒకే ఒక్క లగ్జరీ భోజనాన్ని దాటవేసి, మీనాక్షి వంటి పిల్లలకు సహాయం చేయండి. ఒక్క లగ్జరీ భోజనం ఖర్చు మీ జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపకపోవచ్చు. కానీ ఇక్కడ 10మందిపిల్లలకు ఒక పూట భోజనాన్ని అందించడానికి సహాయం చేస్తుంది.

మీ సహకారం ఒకరి భవిష్యత్తుకు ఆసరా.

భారతదేశ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80G క్రింద, మీకు 50% పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు.

పదిమంది పిల్లలకు - 4,500 రూపాయలు
ఒక తరగతి గది - 13,500 రూపాయలు (30 మంది పిల్లలు)
మూడు తరగతులు -40,500 రూపాయలు (90 మంది పిల్లలు)
ఒక ప్రాథమిక పాఠశాల - 45,000 రూపాయలు (100 మంది పిల్లలు)
రెండు ప్రాధమిక పాఠశాలలు - 90,000 రూపాయలు (200 మంది పిల్లలు)
ఒక ప్రభుత్వ పాఠశాల - 2,50,000 రూపాయలు

ఇక్కడ క్లిక్ చేసి సాయం చేయండి

అన్నామృత గురించి:

అన్నామృత "విద్య కోసం అపరిమిత పోషకాహారం"అన్న ద్యేయంతో, అనేకమంది పిల్లలను పాఠశాలలో చేరిపిస్తూ, విద్య గొప్పతనాన్ని వారికి పరిచయం చేస్తూ, వారి బాల్యాన్ని తిరిగి వారికి ప్రసాదించే అద్భతమైన ఆశయంతో ముందుకు సాగుతుంది. భారతదేశంలో ఆకలి మరియు నిరక్షరాస్యత నిర్మూలన లక్ష్యంతో మొదలైనఈ కార్యక్రమం వ్యూహాత్మకంగా ఆరోగ్యకరమైన, పోషకమైన, స్వచ్ఛమైన మరియు పరిపూర్ణమైన భోజనాన్ని పసిపిల్లలకు అందించే లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉంది. ఒక ఆరోగ్యకరమైన భోజనం కారణంగా, పిల్లలు పాఠశాలలకు హాజరవుతూ, మంచి విద్యను కూడా పొందగలరు. క్రమంగా దేశ భవిష్యత్తు నిర్మాణంలో రేపటి పౌరులుగా నిలబడే అవకాశాన్ని అందివ్వగలుగుతుంది అన్నామృత.

ఇప్పుడే మీ విరాళాలను అందించండి :
"అన్ని విరాళాలు US 501 (సి) (3) పన్ను మినహాయింపునకు అర్హత కలిగినవి."

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X