help lady woman president ram nath kovind buy helicopter loan letter sons farmer PM modi CM officers సహాయం లేడీ మధ్యప్రదేశ్ మహిళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొనుగోలు హెలికాప్టర్ లెటర్ కొడుకులు రైతు ప్రధాని మోదీ సీఎం అధికారులు
Help: హెలికాప్టర్ కావాలి, లోన్ కోసం రాష్ట్రపతికి లెటర్ రాసిన మహిళా రైతు, ఎందుకు ?, ఏమిటి?
భోపాల్/ న్యూఢిల్లీ: హెలికాప్టర్ కొనుగోలు చెయ్యడానికి ఆర్థిక సహాయం చెయ్యాలని, లోన్ ఇప్పించాలని ఓ పేద మహిళ ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మనవి చేసింది. మా పొలం దగ్గరకు మేము వెళ్లి రావడానికి చాలా ఇబ్బందిగా ఉందని, అక్కడికి హెలికాప్టర్ లో వెళ్లి రావడానికి అధికారులకు అనుమతి ఇవ్వాలని మీరు సూచించాలని ఆ మహిళ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఓ పేద మహిళ హెలికాప్టర్ కొనుగోలు చెయ్యడానికి లోన్ ఇప్పించాలని రాష్ట్రపతికి లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ పేద మహిళ ఏదో తమాషాకు, ఫ్రీ పబ్లిసిటీ కోసమో రాష్ట్రపతికి లేఖ రాయలేదు. నిజయంగానే హెలికాప్టర్ కావాలని మనవి చెయ్యడం కలకలం రేపింది.
Film Making: ఓటీటీ సిరీస్ చాన్స్ లు, మోడల్స్, ఆంటీలు టార్గెట్, లక్షల్లో సంపాధన, ఏం స్కెచ్!

పేద కుటుంబం
మధ్యప్రదేశ్ లోని మందసూర్ జిల్లాలోని అగర్ గ్రామంలో రామకరన్, బసంతి దంపతులు నివాసం ఉంటున్నారు. అగర్ గ్రామంలో రామకరన్, బసంతి దంపతులకు వ్యవసాయ పోలం ఉంది. రామకరన్, బసంతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులకు, రామకరన్, బసంతి దంపతులకు ఆస్తి పంపకాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

సమస్య ఎక్కడంటే ?
రామకరన్, బసంతి దంపతులు వారి పోలంలోకి వెళ్లాలంటే రైతు పరమానంద పాటీదార్, కొడుకులు లవ, ఖుష పోలం దాటుకుని వెళ్లాలి. అయితే సాటి రైతు పరమానంద పాటీదార్ తన పొలంలో నుంచి మీ పోలంలోకి వెళ్లడానికి వీళ్లేదని రామకరన్ దంపతులకు తేల్చి చెప్పాడు. పనిలో పనిగా సొంత కొడుకులు లవ, ఖుష కూడా మా పొలంలో నుంచి మీరు వెళ్లడానికి వీళ్లేదని కన్న తల్లిదండ్రులు రామకరన్, బసంతి దంపతులకు తేల్చిచెప్పారు.

అందరూ చేతులు ఎత్తేశారు
రామకరన్, బసంతి దంపతులు వారి పొలంలోకి వెళ్లాలంటే వేరే మార్గం లేకపోవడంతో గ్రామ పెద్దలను ఆశ్రయించారు. గ్రామ పెద్దలు సైతం రైతు పరమానంద పాటీదార్, లవ, ఖుషలకు మద్దతుగా మాట్లాడారు. తమకు న్యాయం చెయ్యాలని మధ్యప్రదేశ్ గ్రామ పంచాయితీ అధికారులకు మనవి చేసినా వాళ్లు పట్టించుకోకపోవడంతో రామకరన్ దంపతులు ఏమీ చెయ్యలేకపోయారు.

నిన్న సీఎం, ప్రధాన మంత్రికి లేఖలు
తమ పొలంలోకి వెళ్లడానికి ఏ మార్గం లేదని, పొలం పనులు చెయ్యడానికి ఏ వస్తువులు తీసుకుని వెళ్లడానికి అవకాశం లేదని, మీరే న్యాయం చెయ్యాలని కొంతకాలం క్రితం రామకరన్, బసంతి దంపతులు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాసినా వారి నుంచి ఎలాంటి స్పందనలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

అమ్మ దెబ్బకు దిమ్మతిరిగిపోయింది
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాసి న్యాయం చెయ్యాలని వేడుకున్నా వారి నుంచి ఎలాంటి స్పందనలేదని, అందుకే మేము చివరి అవకాశం కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు హెలికాప్టర్ కావాలని లేఖ రాశామని బసంతి మీడియాకు చెప్పారు. హెలికాప్టర్ కొనుగోలు చెయ్యడానికి లోన్ ఇప్పించాలని హిందీలో టైప్ చేసి రాష్ట్రపతికి లేఖ పంపించడంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా రామకరన్, బసంతి దంపతుల లేఖ హాట్ టాపిక్ అయ్యింది.