వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమలకు వెళ్ళే భక్తుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభం ... కరోనా సమయంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యం

|
Google Oneindia TeluguNews

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. రెండు నెలల పాటు వార్షిక మండల మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు దర్శనాలకు అనుమతినిచ్చింది ట్రావెన్కోర్ దేవస్థానం. ప్రతిరోజు వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశానికి అనుమతించి , వారాంతాల్లో రెండు వేల మందిని అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. భక్తులందరూ కరోనా పరీక్షలు చేయించుకొని నెగటివ్ సర్టిఫికెట్లు తీసుకువెళితేనే దర్శనాలకు అనుమతినిస్తారు. అంతేకాదు 60 ఏళ్ల పైబడిన వారిని పదేళ్లలోపు వారిని దర్శనానికి అనుమతించేది లేదని ట్రావెన్కోర్ దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

శబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిశబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

దర్శనానికి ఆన్ లైన్ లో స్లాట్ బుక్ .. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్

దర్శనానికి ఆన్ లైన్ లో స్లాట్ బుక్ .. సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆన్లైన్ లో స్లాట్ బుకింగ్ చేసుకుని, నిర్దేశించిన స్లాట్ లోనే దర్శనం చేసుకోవాల్సి ఉంది. ఆలయంలో తీసుకోవలసిన భద్రతా చర్యలు, వెళ్లవలసిన మార్గాలు తదితర అంశాలపై సమాచార ఇవ్వడం కోసం శబరిమలకి వెళ్లే భక్తుల కోసం హిందూమతం మరియు స్వచ్ఛంద ఎండోమెంట్స్ విభాగం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 1800-425-1757 అనే 24 గంటల హెల్ప్‌లైన్‌ను ప్రారంభించి భక్తులకు కావాల్సిన అన్ని వివరాలను అందించనుంది.

జనవరి 20, 2021వరకు భక్తుల సౌకర్యార్ధం హెల్ప్ లైన్ సర్వీసులు

జనవరి 20, 2021వరకు భక్తుల సౌకర్యార్ధం హెల్ప్ లైన్ సర్వీసులు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా స్లాట్ల ఆన్‌లైన్ బుకింగ్, ప్రయాణ మార్గాలు మరియు ఆలయంలో భద్రతా చర్యలు తీసుకోవడం గురించి ఈ టోల్ ఫ్రీ నంబర్ సమాచారం అందిస్తుంది. ఈ సీజన్‌కు దర్శనం చివరి తేదీ అయిన జనవరి 20 2021వరకు ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. దర్శనానికి సంబంధించిన సమాచారమే కాకుండా ప్రసిద్ధ మార్గాల్లోని దేవాలయాలు ఇలాంటి సమాచారం మరియు భక్తులకు సురక్షితమైన తాగునీరు మరియు విశ్రాంతి గదులు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తాయి.

Recommended Video

Shirdi Sai Temple Reopens | Oneindia Telugu
కరోనా కారణంగానే టోల్ ఫ్రీ నంబర్ ... దర్శనానికి గైడెన్స్

కరోనా కారణంగానే టోల్ ఫ్రీ నంబర్ ... దర్శనానికి గైడెన్స్

భక్తుల భద్రత కోసం విధించిన ఆంక్షల కారణంగా, సందర్శన ఎలా ఉంటుందోనని చాలామంది భయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దర్శనం స్లాట్ బుక్ చేసుకుని, కరోనా నిబంధనలు పాటిస్తూ, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తీసుకొని దర్శనానికి వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకొని, వారి సలహాలు సూచనల మేరకు శబరిమలకు ప్రయాణాలు సాగించాలని అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలోనే ఈసారి హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసి మరీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు .

English summary
The Hindu Religious and Charitable Endowments (HR and CE) Department has introduced a 24-hour helpline in sabarimala . 1800-425-1757, for devotees proceeding to Sabarimala .The number will provide information about online booking of slots, routes to take and safety measures being taken at the temple, due to the COVID-19 pandemic. Official sources said that the number will function till January 20, 2021, the last date of darshan for this season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X