వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టిస్ట్ హేమ హత్యలో షాకింగ్: భర్త ఏం చెప్పాడు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆర్టిస్ట్ హేమా ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది హత్య కేసులో హేమా భర్త చింతన్ ఉపాధ్యాయను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించారు. ఈ విచారణలో చింతన్ షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

హేమా హత్యతో తనకు సంబంధం లేదని చింతన్ ఉపాధ్యాయ తొలుత చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మంగళవారం అతనిని అరెస్టు చేశారు. విచారణలో అతను తన భార్యను చంపేందుకు ఎలా కుట్ర చేసింది వివరించాడు.

Hema murder: Shocking info revealed

చింతన్ ఉపాధ్యాయ ఏం చెప్పాడు?

- ఓసారి చింతన్ అభ్యంతరకర పెయింటింగ్ వేశాడు. అది ఆయన భార్య హేమకు ఏమాత్రం నచ్చలేదు.
- తన పట్ల ఆమె వ్యవహారశైలి నచ్చలేదు.
- పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తనను కోర్టుకు లాగిన నేపథ్యంలో, న్యాయస్థానాలకు తిరగలేక అతను హేమను చంపాలని నిర్ణయించుకున్నాడు.
- హేమ - చింతన్ భార్యాభర్తలు. ఆ తర్వాత వీరి విడాకుల విషయం కోర్టు దాకా వెళ్లింది.
- 2013లోనే తొలిసారి తన భర్త చింతన్ పైన హేమ కేసు పెట్టారు. తాము వివాహం చేసుకున్న ఇంటిలోని గోడల పైన అసభ్యకర మహిళల ఫోటోలు గీస్తున్నారని పేర్కొన్నారు. అలాగే తనను వేధిస్తున్నాడని చెప్పారు.
- తాము బరోడాలో కోర్స్ చేస్తుండగా ప్రేమలో పడినట్లు పోలీసుల విచారణలో చింతన్ చెప్పారు. 1999లో పెళ్లైనట్లు చెప్పారు.
- 2013లో విడాకుల ఫైనల్ సెటిల్మెంట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు చింతన్ చెప్పాడు. లేదంటే నెలకు రూ.5 లక్షలు ఇవ్వాలని షరతు పెట్టినట్లు చెప్పాడు.
- తాను హేమను మాత్రమే చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానని, కానీ వారు లాయర్‌ను కూడా చంపేశారని చెప్పాడని తెలుస్తోంది.

- చింతన్.. విద్యాధర్ రాజ్‌భర్‌తో కలిసి హేమను చంపేందుకు కుట్ర చేశాడు.
- విద్యాధర్... హేమను చంపేందుకు రూ.30 లక్షలు అడిగాడు. చివరకు రూ.10 లక్షల వద్ద ఒప్పందం కుదిరింది.
- సమాచారం మేరకు... హేమను, ఆమె లాయర్‌ను విద్యాధర్ రాజ్‌భర్ వేర్ హౌస్‌కు రప్పించేందుకు చింతన్ ప్లాన్ చేశాడు. ఆమెకు ఫోన్ చేయడం ద్వారా రప్పించాలని ప్లాన్ చేశారు.

English summary
Shocking revelations have come to light in the double murder case of artist Hema Upadhyay and her lawyer Harish Bhambhani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X