వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం: రాహుల్, మమతా సహా నేతల హాజరు

|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ పార్టీల ముఖ్య నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా, హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రి. గతంలోనూ ఆయన సీఎంగా పనిచేశారు. 2013-14లో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది.

 Hemant Soren takes oath as 11th CM

గత సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి దూసుకెళ్లింది. 81 అసెంబ్లీ స్థానాలు కలిగిన జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్-జనతా దళ్(ఆర్జేడీ) కూటమి 47 స్థానాలను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఐదు సీట్లను ఎక్కువగానే గెలుచుకుంది. బీజేపీ మాత్రం 25 సీట్లకే పరిమితమైంది.

English summary
Hemant Soren took oath as the eleventh Chief Minister of Jharkhand at a mega event in Ranchi this afternoon, days after his Jharkhand Mukti Morcha - along with ally Congress and the RJD - won a clear majority in the state elections earlier this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X