వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఇలా తెలుసుకునే ఛాన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: నకిలీ సమాచార వ్యాప్తాని అరికట్టడమే లక్ష్యంగా ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇకపై వినియోగదారులు తమకు వచ్చిన సందేశాన్ని స్వయంగా పంపిన వారే రాశారా లేక ఎవరో పంపిన దానిని ఫార్వార్డ్ చేశారా అని తెలుసుకోవచ్చు.

వాట్సాప్ యాప్ తాజా అప్ డేట్‌లో ఈ ఫీచర్‌ను జోడించినట్లు మంగళవారం తెలిపారు. వినియోగదారులు ఓ సందేశాన్ని ఫార్వార్డ్ చేసే ముందు అది ఎంత వరకు నిజమో సరిచూసుకోవాలని కోరింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మన దేశంలో ప్రారంభించింది.

Here are latest WhatsApp features to tackle fake news

ఫేక్ న్యూస్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో వాట్సాప్ సంస్థ దిగి వచ్చింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా పలు మార్పులు చేసింది.

వాట్సాప్ 2.18.204 బీటా వర్షన్‌లో అనుమానిత లింక్ అనే ఈ ఫీచర్‌ను యాడ్ చేసింది. లింక్ మెసేజ్ ఉంటే అది వార్నింగ్ కింద లెక్క. కాబట్టి సందేశాన్ని ఫార్వార్డ్ చేసే ముందు వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

గ్రూప్‌లలో ఫార్వార్డ్ అయ్యే ఫేక్ న్యూస్‌ను ఈ యాప్ కనిపెట్టి యూజర్లను హెచ్చరిస్తుంది. వినియోగదారులు ఆ సందేశాలను పార్వార్డ్ చేసే సమయంలో అది ఏ వెబ్ సైట్ లింక్ అనే విషయాన్ని ఆ సైట్ ప్రామాణికతను పరీక్షిస్తుంది. మన గ్రూప్‌లో పెట్టే షేర్ అయిన సందేశాన్ని టైప్ చేసి పంపారా లేక తమకు వచ్చిన దానిని ఫార్వార్డ్ చేశారా అనే విషయాన్ని కూడా గుర్తించవచ్చు.

English summary
WhatsApp announced its latest feature globally that will highlight when a message has been forwarded versus composed by the sender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X