వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవీ ప్రధాని మోడీ ఆస్తులు: బ్యాంకులో రూ.4వేలు..చేతిలో క్యాష్ రూ.38 వేలు

|
Google Oneindia TeluguNews

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసి నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌లో భాగంగా మోడీ తన అఫిడవిట్‌ను సమర్పించారు. ఇందులో మోడీ ఆస్తులు ఏంటి.. వాటి విలువ ఇప్పుడు ఎలాగుంది...? మోడీ ఏ బ్యాంకులో తన ఖాతను మెయింటెయిన్ చేస్తున్నారు..?

గ్రాండ్‌గా ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమం

ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా జరిగింది. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకుగాను ప్రధాని గురువారం సాయంత్రమే వారణాసికి చేరుకుని మెగారోడ్‌ షోలో పాల్గొన్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేరా రోడ్ షోలో పాల్గొని వారణాసిలోని బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపారు. అనంతరం వారణాసి ఘాట్‌ వద్ద ఆయన పవిత్ర గంగానదికి హారతి పట్టారు. అనంతరం శుక్రవారం ఉదయం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నేరుగా వారణాసి కలెక్టొరేట్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

చరాస్తుల విలువ 1.41 కోట్లు...స్థిరాస్తుల విలువ రూ. 1.10 కోట్లు

చరాస్తుల విలువ 1.41 కోట్లు...స్థిరాస్తుల విలువ రూ. 1.10 కోట్లు

నామినేషన్‌లో భాగంగా మోడీ అఫిడవిట్ సమర్పించారు. అందులో తన ఆస్తుల గురించి ప్రస్తావించారు. ఎక్కువగా చరాస్తులే మోడీకి ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటి విలువ రూ.1.27 కోట్లు ఉండగా అన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.2.51 కోట్లు అని పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ. 1.41 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.1.10 కోట్లుగా పేర్కొన్నారు.

2014తో పోలిస్తే చరాస్తుల విలువ 114.5 శాతం పెరుగుదల

2014తో పోలిస్తే చరాస్తుల విలువ 114.5 శాతం పెరుగుదల

ప్రధాని మోడీ ప్రస్తుత చరాస్తుల విలువ 2014తో పోలిస్తే 114.5 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.2014లో తొలిసారిగా లోక్‌సభకు పోటీ చేసిన సమయంలో ఆయన చరాస్తుల విలువ రూ.65.91 లక్షలు ఉన్నట్లుగా నాటి అఫిడవిట్‌లో తెలిపారు. మోడీ ప్రాథమిక సంపాదన కేవలం ప్రభుత్వం నుంచి పొందే సంపాదన, పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీ మాత్రమే అని తెలుస్తోంది. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని మోడీ అఫడవిట్‌లో పొందుపర్చారు.

మోడీ చరాస్తులు స్థిరాస్తులు ఇవే:

మోడీ చరాస్తులు స్థిరాస్తులు ఇవే:


31 మార్చి 2019 నాటికి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఉన్న చరాస్తుల విలువ ఈ విధంగా ఉన్నాయి. చేతిలో నగదు రూ.38,750 ఉండగా మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 4,143గా ఉన్నట్లు తెలిపారు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 1.27 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. 2014లో చేతిలో డబ్బు రూ. 32,700 ఉండగా నాడు బ్యాంక్ బ్యాలెన్స్ రూ.26.05 లక్షలు ఉన్నట్లుగా తెలిపారు. ఇక 2014లో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో రూ. 32.48 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్&టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 20వేల రూపాయలు విలువ చేసే బాండ్లు ఉన్నట్లు ఈ సారి అఫిడవిట్‌లో పొందుపర్చారు. ఇక సేవింగ్స్ రూపంలో (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ ) రూ. 7.61 లక్షలు ఉన్నట్లు తెలిపారు. లైఫ్ ఇన్ష్యూరెన్స్ రూపంలో 1.90 లక్షలు ఉన్నట్లు పొందుపర్చారు. ఇక ప్రధానికి 45 గ్రాములు మేరా నాలుగు బంగారు ఉంగరాలు ఉండగా వాటి విలువ రూ. 1,13,800 అని తెలిపారు.

మోడీ స్థిరాస్తులు
ఇక ప్రధాని మోడీ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.1.10 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇది 2014తో పోలిస్తే రూ.10 లక్షలు పెరిగినట్లు సమాచారం. ఇక గాంధీనగర్‌లోని సెక్టార్ 1లో మోడీకి ఒక ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. 2014లో స్థిరాస్తుల విలువ రూ. 1 కోటి ఉన్నట్లుగా డిక్లేర్ చేశారు.

English summary
Prime Minister Narendra Modi's movable assets have grown by 52 per cent between 2014 and 2019, shows his affidavit filed on Friday in Varanasi. The affidavit was filed as part of the nomination papers that PM Narendra Modi submitted in Varanasi, the seat from where he is contesting the 2019 Lok Sabha election. Much of his movable assets come in the form of fixed deposits worth Rs 1.27 crore in the State Bank of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X