India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒవైసీపై హత్యాయత్నం పక్కా ప్లాన్: సీసీటీవీ ఫుటేజీ ఇదే: 9 ఎంఎం పిస్టల్: కేటీఆర్ షాక్

|
Google Oneindia TeluguNews

లక్నో: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న ఈ దశలో ఆయనపై కాల్పులకు పాల్పడటం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటన అనంతరం- పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

కారుపై బుల్లెట్ల వర్షం..

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా పాల్గొంటున్నారు. మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో ఢిల్లీలో బయలుదేరిన సందర్భంగా ఆయన ప్రయాణిస్తోన్న కారుపై కాల్పులు చోటు చేసుకున్నాయి. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు.

సీసీటీవీ ఫుటేజీ ఇదే..

ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విడుదలైంది. ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరపడం స్పష్టంగా ఇందులో కనిపించింది. ఎరుపురంగు హుడీ ధరించిన ఓ యువకుడు తొలుత కాల్పులు జరపడం.. కారు వైపు వేగంగా దూసుకుని రావడంతో అతను కిందపడటం ఇందులో రికార్డయింది. అదే సమయంలో వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్న మరో వ్యక్తి కాల్పులు జరుపడం టోల్‌ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. టోల్ ప్లాజా దాటుతున్న సమయంలో కారు స్లో కావడంతో వారు ఈ కాల్పులు జరిపారు.

అదుపులో ఒకరు..

అదుపులో ఒకరు..

ఒవైసీ కారుపై కాల్పులకు పాల్పడిన వారిలో ఒకడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. మిగిలిన వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. దీనికోసం అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఉత్తర ప్రదేశ్ శాంతి భద్రతల విభాగం అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కాల్పులు జరపడానికి నిందితులు 9 ఎంఎం పిస్టల్‌‌ను వినియోగించారని పేర్కొన్నారు. మారణాయుధాన్ని నిందితుడి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పక్కా ప్లాన్..

పక్కా ప్లాన్..

తనపై హత్యాయత్నం పూర్తిగా పక్కా ప్లాన్ ప్రకారమే చోటు చేసుకుందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తుతానని అన్నారు. స్పీకర్ ఓం బిర్లాను కలుసుకుని వినతిపత్రాన్ని అందజేస్తానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఎన్నికలనేవి ఓ పండగలాంటివని, అలాంటి సమయంలో రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా మట్టుబెట్టే ప్రయత్నం చోటు చేసుకుందని మండిపడ్డారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Assembly Elections 2022: Rallies, Road Show లకు EC నో.. | Oneindia Telugu
కేటీఆర్ షాక్..

కేటీఆర్ షాక్..

ఒవైసీపై హత్యాయత్నం పట్ల అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన తృటిలో తప్పించుకోవడం సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని అన్నారు. ఈ ఘటన తరువాత పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నిఘా ముమ్మరం చేశారు.

ఆయన ఇంటివద్ద భద్రతను బలోపేతం చేశారు. చార్మినార్‌, మ‌క్కామ‌సీదు వంటి ప్రాంతాల్లో పోలీసుల బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

English summary
Uttar Pradesh Police released the CCTV footage of attack on AIMIM chief and Hyderabad MP Asaduddin Owaisi's car at toll plaza.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X