వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ప్రపంచ దేశాల అధినేతల జాబితా ఇదే..!

|
Google Oneindia TeluguNews

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది బీజేపీ. ఇక రెండవ సారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోడీ. రంగరంగ వైభవంగా జరిగనున్న మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు విదేశీ అధినేతలను కూడా మోడీ ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, క్రిగిస్థాన్ దేశ అధ్యక్షులు తాము మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోడీ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో మే 30 సాయంత్రం 7 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోడీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి నేపాల్ ప్రధాన మంత్రి, మారిషస్, భూటాన్ ప్రధాన మంత్రులు కూడా హాజరుకానుండగా... థాయ్‌లాండ్‌ దౌత్యాధికారి కూడా ఆదేశ ప్రభుత్వం తరపున హాజరుకానున్నట్లు వెల్లడించారు.

Here is the list of global leaders attending the Modi Swearing-in-ceromony

ఇక బిమ్స్‌టెక్ దేశాలకు చెందిన నేతలను కూడా మోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఇందులో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలున్నాయి. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, క్రిగిస్థాన్ అధ్యక్షుడు సూరన్‌బే జీన్‌బెకోవ్, మయన్మార్ అధ్యక్షుడు యువిన్ మింట్, మయన్మార్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్‌లు హాజరు అవుతారని ప్రభుత్వ తెలిపింది. ఇంకా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎవరొస్తారో అనేదానిపై ఎప్పిటికప్పుడు అప్‌డేట్స్ తెలుపుతామని చెప్పిన విదేశీ వ్యవహారాల శాఖ... వీరి మధ్య ఏమైనా ద్వైపాక్షిక చర్చలు ఉంటే ఆ విషయాలు కూడా వెల్లడిస్తామని తెలిపింది.

English summary
The presidents of Bangladesh, Sri Lanka, Myanmar and Kyrgyzstan on Tuesday were among a host of foreign dignitaries who confirmed their attendance at Narendra Modi’s swearing-in ceremony for a second term on Thursday.President Ram Nath Kovind will administer the oath of office and secrecy to the prime minister and other members of the Union Council of Ministers at a ceremony in Rashtrapati Bhavan on Thursday at 7pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X