వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీ బాలు చివరి కోరిక ఇదే - సినీ రంగంలో కుబేరుడు - కొడుకు చరణ్ కెరీర్‌పైనా బాధ

|
Google Oneindia TeluguNews

నాలుగు దశాబ్దాల కెరీర్.. 16 భాషల్లో 41,230 పాటలు.. గాయకుడిగానేకాదు నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ అందెవేసిన చేయి.. వెళ్లిన ప్రతిచోటా మనస్ఫూర్తిగా ఆదరించి అభిమానించిన ప్రజలు.. పొద్దికైన కుటుంబం.. పాటలపై మక్కువతో తన కొడుక్కి చరణ్ అని, కూతురికి పల్లవి అని పేర్లు పెట్టుకున్నారు.. వయసు పైబడినా.. యువతరంతో పోటీ పడుతూ రికార్డింగ్స్ చేసేవారు.. కరోనా బారిన పడేంత వరకూ ఆయన గొంతు పలుకుతూనే ఉండింది.. అయితే జీవితంలో చివరి కోరిక విషయంలో మాత్రం ఆ గాన గంధర్వుడి అంచనా అటుఇటైంది..

Recommended Video

#SP Balasubrahmanyam Last Wish Not Fulfilled సినీ రంగంలో కుబేరుడు SPబాలు గారు ! || Oneindia Telugu

అంతటి గాన గంధర్వుడికే గొంతు అరువు - ఎస్పీ బాలు లైఫ్‌లో అరుదైన ఘటన - సుఖ్విందర్ ఎంత లక్కీ!అంతటి గాన గంధర్వుడికే గొంతు అరువు - ఎస్పీ బాలు లైఫ్‌లో అరుదైన ఘటన - సుఖ్విందర్ ఎంత లక్కీ!

సినీ రంగంలో కుబేరుడు..

సినీ రంగంలో కుబేరుడు..


ఎంతటి కష్టతరమైన స్వరాలను కూడా అవలీలగా పలికిచడం ఎస్పీబాలుకే చెల్లింది. కెరీర్ ఆరంభం నుంచే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఆయన.. కరోనా బారిన పడటానికి ముందు పలు చానెళ్లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. కెరీర్ పీక దశలో రోజుకు 10 గంటల చొప్పుల పాటలు పాడానని, ఒత్తిడిని తట్టుకోలేక కెరీర్ లో 20 ఏళ్ళు సిగరెట్లు కాల్చానని, నటుల బాడీలాంగ్వేజ్, గొంతులకు అనుగుణంగా స్వరం మార్చి పాడానని బాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు, బహుశా సినీ రంగంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తిని తానే కావొచ్చని మొహమాటం లేకుండా చెప్పేశారు.

సర్వనాశనం : ఏఆర్ రెహమాన్ ఉద్వేగం - కొత్త తరం ఎస్పీ బాలను కించపర్చిందా?సర్వనాశనం : ఏఆర్ రెహమాన్ ఉద్వేగం - కొత్త తరం ఎస్పీ బాలను కించపర్చిందా?

బాలు చివరి కోరిక ఇదే..

బాలు చివరి కోరిక ఇదే..

దాపరికం లేకుండా మాట్లాడే ఎస్పీబీ.. ఇటీవల దాదాపు ప్రతి సందర్భంలోనూ తన చివరి కోరికను బయటపెట్టారు. చనిపోయే చివరి నిమిషం దాకా పాడుతుండాలని, చావు దగ్గరకి వచ్చినట్టు తనకు తెలియకుండానే కన్నుమూయాలని కోరుకుంటున్నానని ఎస్పీబీ అన్నారు. కానీ చివరికి ఆయన కోరుకున్నట్లు కాకుండా.. దాదాపు 50 రోజులు ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతూ, అనారోగ్యం తిరగబెట్టడంతో కన్నుమూయడం విచారకరం.

చరణ్ కెరీర్‌పై ఆందోళన..

చరణ్ కెరీర్‌పై ఆందోళన..


ఎస్పీ బాలు ఎంత ప్రాక్టికల్ గా ఉంటారో ఆయన మాటలు వింటే ఇట్టే అర్థమైపోతుంది. మెజార్టీ కెరీర్ చెన్నైలోనే సాగిపోవడం, పిల్లలిద్దరూ అక్కడే అలవాటు పడటంతో బాలు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా చరణ్, పల్లవి చెన్నైలోనే ఉండిపోయారు. గాయకుడిగా రాణించలేకపోయిన చరణ్.. నిర్మాతగా మారాడు. ఆ మధ్య ఓ నటి.. చరణ్ తదితరులపై లైంగికవేధింపుల ఆరోపణలు చేయడం, తర్వాతికాలంలో ఆ కేసు నిలబడకపోవడం తెలిసిదే. త‌న‌కున్న పేరు ప్రతిష్ఠల వల్ల కొడుకు కెరీర్ సక్రమంగా కొనసాగలేదని ఎస్పీ బాలు స్వయంగా చెప్పుకొచ్చారు. ‘‘చరణ్‌ను అందరూ నాతో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరిగింది. సంగీతమా, నటనా, సినిమా నిర్మాణమా ఎటూ తేల్చుకోలేక వాడు తడబడ్డాడు. చ‌ర‌ణ్ ..ఐదు సినిమాలు నిర్మించి రూ.11కోట్లు నష్టపోయాడు'' అని బాలు బాధపడ్డారు.

English summary
In an interview, SP Balu said that he wanted to sing till he died and that he wanted to die without knowing that death was near. the legendary sometimes said .. My son's career did not go smoothly because of the prestige of the name. Charan was very upset that everyone had done him a lot of damage by comparing him to himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X