వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ ఆత్మే మమ్మల్ని నడిపిస్తోంది: పన్నీర్ సెల్వం: త్వరలోనే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయా పరిణామాలపై ఆ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని అమ్మ (జయలలిత) ఆత్మే నడిపిస్తోందని, చివరికి ధర్మమే గెలుస్తోందని పన్నీర్ సెల్వం చెప్పారు. త్వరలో ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని పరోక్షంగా శశికళను హెచ్చరించారు.

<strong>దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!</strong>దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!

శనివారం చెన్నైలో పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజల శ్రేయస్సును కోరుకునే వారందరూ, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది కావాలని ఆకాంక్షించేవారంతా తనకు మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చాలమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో కలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Here the reasons of Chief Minsiter O Panneerselvam's revolt against Sasikala

స్వార్థం కోసం కొందరు తమిళనాడు ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని పన్నీర్ సెల్వం పరోక్షంగా శశికళపై విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ మీద తిరుగుబాటు చేసిన తరువాత రోజులు గడుస్తున్న కొద్ది పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే నేతల మద్దతు క్రమంగా పెరిగుతోంది.

<strong>పోయెస్ గార్డెన్ నుంచి శశికళ ఔట్: జీవోపై సంతకం చేసేసిన పన్నీర్</strong>పోయెస్ గార్డెన్ నుంచి శశికళ ఔట్: జీవోపై సంతకం చేసేసిన పన్నీర్

దీంతో పన్నీర్ సెల్వం వర్గీయులు ఉత్సహంగా ఉన్నారు. పన్నీర్ సెల్వం దూకుడు చూస్తున్న శశికళ అసహనంతో రగిలిపోతున్నారు. ఆమె వర్గీయుల్లో ఆందోళన మొదలైయ్యింది. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అందరూ తమకే మద్దతు ఇస్తారని పన్నీర్ సెల్వం వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శనివారం అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు లోక్ సభ సభ్యులు సుందరం, అశోక్ కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకుని సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో ఆయన వర్గంలో ఉత్సాహం నెలకొంది.

English summary
Here the reasons of Tamil Nadu Chief Minsiter O Panneerselvam's revolt against VK Sasikala Natarajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X