వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hero Sushanth Singh: దెబ్బకు దెయ్యం దిగింది, సుప్రీం కోర్టు, సీబీఐ ఎంట్రీ, ఐపీఎస్ విడుదల !

|
Google Oneindia TeluguNews

ముంబయి/ పాట్నా/ న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు విచారణను బీహార్ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. మరో పక్క కేసు విచారణ చెయ్యడానికి ముంబయి వెళ్లిన బీహార్ ఐపీఎస్ అధికారిని కరోనా క్వారంటైన్ కేంద్రంలో నిర్భందించడంతో బీహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యింది. ఇదే సమయంలో ఉలిక్కిపడిన మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబాయి పోలీసులు క్వారంటైన్ లో ఉన్న బీహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారిని విడుదల చేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 బీహార్ పోలీసులకు థ్రిల్లర్ సినిమా

బీహార్ పోలీసులకు థ్రిల్లర్ సినిమా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి చెందడంతో బీహార్ పోలీసులకు అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే సమయంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎలా మరణించాడు ? ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైనా ఒత్తిడి చేశారా ?, ఈ కేసులో ఎవరెవరికి లింక్ ఉంది ? అంటూ విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని బీహార్ పోలీసులు నిర్ణయించారు. ఇదే సమయంలో బీహార్ నుంచి వెళ్లిన ఐపీఎస్ అధికారి వినయ్ తివారితో పాటు మొత్తం ఐదు మంది పోలీసు అధికారులకు ముంబాయి పోలీసులు థ్రిల్లర్ సినిమా చూపించారు.

 కరోనాను అడ్డం పెట్టుకుని క్వారంటైన్

కరోనాను అడ్డం పెట్టుకుని క్వారంటైన్

బీహార్ నుంచి వెళ్లిన యువ ఐపీఎస్ అధికారి వినయ్ తివారి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుపై ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుపై ముంబాయి పోలీసులు ఆసక్తి చూపించడం లేదని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చెయ్యడంతో ముంబాయి పోలీసులు హడలిపోయారు. ముంబాయి పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కాక కరోనా వైరస్ ను అడ్డుపెట్టుకుని బీహార్ నుంచి వచ్చి హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణ చేస్తున్న ఐపీఎస్ అధికారి వినయ్ తివారిని పట్టుకుని క్వారంటైన్ కు తరలించి అక్కడ ఆయన్ను నిర్బంధించారు.

 సీఎం, డీజీపీ సీరియస్

సీఎం, డీజీపీ సీరియస్

తమ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి విధినిర్వహణలో భాగంగా కేసు విచారణ చెయ్యడానికి ముబాయి వస్తే పిలుచుని వెళ్లి క్వారంటైన్ లో పెడుతారా ? మీకు ఎంత ధైర్యం అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే మండిపడ్డారు. ముంబాయిలోని క్వారంటైన్ లో నిర్భంధంలో ఉన్న ఐపీఎస్ అధికారి వినయ్ తివారిని విడిపించడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డీజీపీ గుప్తేశ్వర్ పాండే అనేక ప్రయత్నాలు చేసినా ఇన్ని రోజులు ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో ఐపీఎస్ అధికారి వెంట ముంబాయి వెళ్లిన మరో నలుగురు పోలీసు అధికారులను ముంబాయి పోలీసులు విడిచిపెట్టడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

 సుప్రీం కోర్టు, సీబీఐ ఎంట్రీతో దిగులు

సుప్రీం కోర్టు, సీబీఐ ఎంట్రీతో దిగులు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. ఇదే సమయంలో ముంబాయిలోని క్వారంటైన్ లో ఉన్న ఐపీఎస్ అధికారిని విడిపించడానికి బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారు. ఈ పరిణామాలు మొత్తం గమనించిన ముంబాయి పోలీసులు ఎక్కడ మొదటికే మోసం వస్తుందో అనే భయంతో దిగులు చెందారు.

 ఐపీఎస్ ను వదిలేస్తే పీడ పోతుంది ?

ఐపీఎస్ ను వదిలేస్తే పీడ పోతుంది ?

విధినిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారిని మీరు ఎలా క్వారంటైన్ కు తరలిస్తారు ? అని సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పాలి ? అంటూ ముంబాయి పోలీసులకు భయం పట్టుకుంది. ఇదే సమయంలో రాత్రికిరాత్రి క్వారంటైన్ లో ఉంటున్న బీహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారిని విడుదల చేసిన ముంబాయి పోలీసులు సార్ మీరు వెళ్లిపోండి అంటూ వేడుకున్నారు.

Recommended Video

Sushant తండ్రి సంచలన వీడియో.. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే సుశాంత్ చనిపోయాడు అంటూ ఆవేదన !
తూతూ మంత్రంగా విచారణ ?

తూతూ మంత్రంగా విచారణ ?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును ఇప్పటికే సీబీఐ అధికారులు విచారణ చెయ్యడం మొదలు పెట్టడంతో ముంబాయిలో క్వారంటైన్ నుంచి విడుదలైన ఐపీఎస్ అధికారి వినయ్ తివారి శుక్రవారం బీహార్ బయలుదేరి వెళ్లారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని మొదటి నుంచి ముంబాయి పోలీసులు చెబుతున్నారు. ముంబాయిలోని బాంధ్రా పోలీసు అధికారులు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నారని దేశవ్యాప్తంగా విమర్శలు మొదలైనాయి.

English summary
Hero Sushanth Singh death: Bihar IPS officer Vinay Tiwari, who was quarantined in Mumbai, to leave for Patna today. Four other officers had returned to Patna yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X