వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ టూ ఇండియా: రూ. 110 కోట్ల డ్రగ్స్ సీజ్

|
Google Oneindia TeluguNews

అమృత్ సర్: భారత్ కస్టమ్స్ అధికారులు, బీఎస్ఎఫ్ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని భారత్- పాకిస్థాన్ సరిహద్దులో గురువారం అర్దరాత్రి 75 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ స్మగ్లర్లు భారత్ లోకి హెరాయిన్ తరలిస్తున్నారని ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందడంతో బీఎస్ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సరిహద్దు ప్రాంతాలలో సోదాలు చేశారు. గురువారం అర్దరాత్రి అమృత్ సర్ సమీపంలో కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయం గుర్తించారు.

Heroin worth Rs. 110 crore seized near Amritsar in Punjab

నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. అధికారులు వెళ్లి బ్యాగ్ లు పరిశీలించగా అందులో 75 కేజీల హెరాయిన్ బయటపడింది. వెంటనే హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ. 110 కోట్లు ఉంటుందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. నిత్యం ఏదో ఒక విదంగా పాకిస్థాన్ నుంచి భారత్ లోకి డగ్స్ సరఫరా చెయ్యడానికి విఫలయత్నం చేస్తున్నారని అధికారులు అన్నారు.

ఇప్పటి వరకు భారత్- పాకిస్ధాన్ సరిహద్దులో చాల సార్లు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. రూ. వందల కోట్ల విలువైన డ్రగ్స్ భారత్ లోకి తరలించడానికి పాక్ లోని స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది

English summary
The smugglers and recover 74.55 kg heroin of high grade Afghan origin valued at nearly Rs. 110 crore in the illicit international market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X