వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తి -తొలిదశలో 10కోట్ల డోసులు -హెటిరోతో రష్యా ఒప్పందం

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే ఆవిష్కరణకు నోచుకున్న ఏకైక కొవిడ్-19 వ్యాక్సిన్.. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వీ ఇక భారత్ లోనూ ఉత్పత్తి కానుంది. ఇండియాలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటనలు వెలువడ్డాయి. భారత ఫార్మా దిగ్గజం హెటిరో సంస్థతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) మధ్య ఈ మేరకు కుదిరిన అవగాహన ఒప్పందాలను ఆయా సంస్థలు వెల్లడించాయి.

రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్ ను భారత్ లో హెటిలో ఉత్పత్తి చేయనుంది. ఏడాది కాలానికిగానూ కుదిరిన ఒప్పందంలో భాగంగా తొలి దశలో 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేయనున్నారు. 2021 ప్రారంభం నుంచే ఉత్పత్తి ప్రక్రియ మొదలుకానుందని ఆయా సంస్థలు తెలిపారు. రష్యా.. ప్రపంచ దేశాలకు అందించాలనుకుంటోన్న డోసులన్నీ దాదాపు ఇండియాలోనే ఉత్పత్తి కానున్నాయి.

ఓవైసీకి నారా లోకేశ్ వార్నింగ్ -ఎంఐఎంపై చంద్రబాబు నిప్పులు -గ్రేటర్‌లో టీడీపీ సీన్ ఇదిఓవైసీకి నారా లోకేశ్ వార్నింగ్ -ఎంఐఎంపై చంద్రబాబు నిప్పులు -గ్రేటర్‌లో టీడీపీ సీన్ ఇది

Hetero, RDIF to produce 100 million doses of Russian Covid vaccine Sputnik V in India

''కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా, సమర్థవంతంగా వ్యవహరిస్తోన్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను భారత్ లో ఉత్పత్తి చేయనుండటం గర్వకారణమని, రష్యాతో ఒప్పందాలు సంతోషకరమని హెటిరో సంస్థ డైరెక్టర్ మురళికృష్ణారెడ్డి అన్నారు. ఇండియాలో ప్ర‌స్తుతం స్పుత్నిక్ టీకాకు చెందిన రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఏడాది మార్చిలోగా ట్ర‌య‌ల్స్‌ను పూర్తి చేయ‌నున్నట్లు ఆయన చెప్పారు.

తిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీతిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ

అత్యంత ప్రభావవంతమైన, సురక్షితమైన స్పుత్నిక్ వ్యాక్సిన్లను భారత్ గడ్డపై ఉత్పత్తి చేయనుండటం ఆనందంగా ఉందని, హెటిరో సంస్థకు ధన్యవాదాలు చెప్పుకోవాలని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ డిమిత్రివ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక క్లినికల్ ట్రయల్ ఫలితాలు మొదటి మోతాదు తర్వాత 42 వ రోజు 95% సామర్థ్యాన్ని చూపాయని ఆయన గుర్తుచేశారు.

English summary
Russia’s sovereign wealth fund and Indian pharmaceutical company Hetero have agreed to produce over 100 million doses of the Sputnik V vaccine against COVID-19 per year in India, according to a statement on the Sputnik V Twitter account on November 27. Hetero and the Russian Direct Investment Fund (RDIF), which has been backing the vaccine and marketing it globally, plan to start production of Sputnik V in India in the beginning of 2021, the statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X