వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో హైఅలర్ట్: ఉగ్రదాడికి పాక్ కుట్రలు, అప్రమత్తమైన భద్రతా బలగాలు

|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్యలో ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు పెను విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యతోపాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మఅయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ

అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలతోపాటు నిఘావేసి ఉంచాయి. ఇక అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో భూమి పూజ నిర్వహించబోయే రోజు, జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

High alert in Ayodhya: Intel warns of terror attack ahead of Aug 5 bhoomi pujan

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గత సంవత్సరం ఆగస్టు 5న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అయోధ్యతోపాటు ఆగస్టు 5న పాక్ ఐఎస్ఐ అయోధ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రలు పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించి హెచ్చరించాయి.

కాగా, ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషీ, ఉమా భారతి, అరెస్సెస్ అగ్రనేతలు మోహన్ భగవవత్, దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు.

ప్రధాని హెలికాప్టర్ దిగే సాకేత్ మహా విద్యాలయం నుంచి రామ జన్మభూమి స్థలం వరకు ఇప్పటికే భద్రతా దళాలు భారీ ఎత్తున మోహరించాయి. అలాగే, రాంకోట్ ప్రాంత నివాసితుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక పాస్ లను కూడా జారీ చేశారు. మాక్ డ్రిల్స్ తోపాటు ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేగాక, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.

ఇది ఇలావుంటే, అయోధ్య భూమి పూజ కోసం ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అయోధ్యను సుందరంగా తీర్చిదిద్దే పనిలో పడింది. వాడవాడలను అందంగా రూపుదిద్దుతున్నారు.

English summary
With central intelligence agencies alerting the state police about possible attempts by terror groups to disrupt and sabotage the 'bhoomi pujan' ceremony of Ram temple by Prime Minister Narendra Modi in Ayodhya next week, all law enforcing agencies in Uttar Pradesh have been put on high alert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X