వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హై అలర్ట్.. పంజాబ్, హర్యానా, కొన్ని జిల్లాల్లో మొబైల్ సేవల్ బంద్..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పంజాబ్, హర్యానాలో హై అలర్ట్ విధించారు. ఇక్కడినుంచి రైతులు/ రైతు నేతలు ఢిల్లీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో అశాంతి చల్లారకుంటే మరిన్ని బలగాలను మొహరిస్తామని కేంద్ర హోం శాఖ చెబుతోంది. ఢిల్లీలో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హై అలర్ట్ విధించామని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నది.

 High alert in Punjab, Haryana; mobile services suspended

హర్యానాలో కూడా పోలీసులు అలర్ట్‌గా ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీచేశారు. అక్రమణదారులు చొరబడేందుకు సిద్దంగా ఉంటారని అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో అవసరమైతే అదనపు బలగాలను మొహరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిని నిఘా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని చెప్పారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టం చేకూరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Recommended Video

Kisan Parade: Kisan Tractor Rally LIVE Updates | Oneindia Telugu

ప్రస్తుతం కొన్ని అసాంఘీక శక్తులు విరుచుకుపడే ప్రమాదం ఉందన్నారు. అశాంతి నెలకొల్పేందుకు రూమర్లు విశ్వసించొద్దని తెలిపారు. సోషల్ మీడియాను కూడా నిశీతంగా గమనిస్తున్నామని తెలిపారు. సోనిపట్, ఝాజర్, పల్వాల్ జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు టెలీకాం సర్వీసులు పనిచేయవని తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

English summary
Farmers protest: 'high alert' has been sounded in Punjab and Haryana in light of the violence that erupted in Delhi during the farmers' tractor rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X