వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్య కేసులో దోషి.. పెళ్లి చేసుకుంటానంటూ పిటిషన్.. జోడీని వెతుక్కునేందుకు పెరోల్..

|
Google Oneindia TeluguNews

ఓ హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఓ దోషి.. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. తనకు 4 వారాల పెరోల్ ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సమాజంలో తనకూ కుటుంబ సంబంధాలున్నాయని.. వాటిని కొనసాగించేందుకు సరైన జోడీని వెతుక్కుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అతని పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది.

2005 నుంచి జైలు శిక్ష...

2005 నుంచి జైలు శిక్ష...

2005 నుంచి సుదీర్ఘ కాలంగా జైలు జీవితం గడుపుతున్నందునా.. విపరీతమైన ఒత్తిడి,మానసిక ఆందోళనకి గురవుతున్నానని, కరోనా కారణంగా అది మరింత ఎక్కువైందని సదరు దోషి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాబట్టి కొంత రిలీఫ్ పొందడం కోసం తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. తన కుటుంబ సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ప్రతీక్ అతనికి 4 వారాల పాటు షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేశారు. 'పిటిషనర్ సమాజంలో కుటుంబ సంబంధాలను కలిగి ఉన్నాడు. ఆ సంబంధాలను కొనసాగించేందుకు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తన విడుదల అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని తలపెట్టేదిగా కనిపించట్లేదు. కాబట్టి అతను కోరినట్టు 4 వారాల పెరోల్ మంజూరు చేస్తున్నాం.' అని జస్టిస్ ప్రతీక్ వెల్లడించారు.

సత్ప్రవర్తన కారణంగా పెరోల్..

సత్ప్రవర్తన కారణంగా పెరోల్..

డిసెంబర్,2019లో జైలు అధికారులు తన పెరోల్ దరఖాస్తును తిరస్కరిండంతో అతను కోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత జనవరిలో కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కానీ కోవిడ్-19 నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలకు పరిమితులు విధించడంతో ఆ పిటిషన్ విచారణకు రాలేదు. ఇటీవల అతని పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఏడాది కాలంగా జైల్లో అతను సత్ప్రవర్తన కలిగి ఉండటంతో పెరోల్ మంజూరు చేసింది.

వారానికి రెండుసార్లు పోలీసులకు ఫోన్ చేయాలన్న కోర్టు..

వారానికి రెండుసార్లు పోలీసులకు ఫోన్ చేయాలన్న కోర్టు..

సదరు దోషి విడుదల సమయంలో.. తిరిగి లొంగిపోయే సమయంలో ఆరోగ్యపరంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.పెరోల్ సమయంలో పంజాబ్ బాగ్,సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లకు తన సమాచారాన్ని చేరవేస్తూ ఉండాలని ఆదేశించింది. 'వారానికి రెండుసార్లు.. ప్రతీ సోమవారం, గురువారం ఉదయం 11గంటల నుంచి 11.30గంటల మధ్యలో పిటిషనర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్,పీఎస్ సివిల్ లైన్స్‌కు వీడియో కాల్ చేసి తన లొకేషన్‌కు సంబంధించి గూగుల్ మ్యాప్‌ను షేర్ చేయాలి.' అని ఆదేశించింది.

English summary
The Delhi High Court has granted four weeks parole to a murder convict, who sought the relief to find a suitable match for himself, saying the man has family ties in the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X