వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకం : ముంబై హోటల్ వద్ద హైడ్రామా.. మంత్రి శివకుమార్‌ను అడ్డుకున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

ముంబై : కర్నాటకం రసవత్తరంగా సాగుతోంది. కన్నడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 13 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతుండగా... తాజాగా సీన్ ముంబైకి మారింది. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత మంత్రి శివకుమార్ ముంబై చేరుకున్నారు. ఆయనతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడ కూడా అక్కడికి వెళ్లారు. ముంబై హోటల్‌లో బస చేసిన రెబెల్ నేతలతో సమావేశం కావాలనుకున్న ఈ ఇద్దరికీ అక్కడ పెద్ద షాక్ తగిలింది.

కర్ణాటక సీఎం మాస్టర్ ప్లాన్, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం, ఓకే !కర్ణాటక సీఎం మాస్టర్ ప్లాన్, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం, ఓకే !

శివకుమార్‌ను అడ్డుకున్న పోలీసులు

శివకుమార్‌ను అడ్డుకున్న పోలీసులు

ఎమ్మెల్యేలు బసచేసిన ముంబైలోని ఫైప్ స్టార్ హోటల్‌కు వెళ్లిన మంత్రి శివకుమార్‌, జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడకు చేదు అనుభవం ఎదురైంది. రెబెల్ నేతల భద్రత దృష్ట్యా వారిద్దరినీ హోటల్‌లోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. హోటల్‌లో రూం బుక్ చేసుకున్నానని శివకుమార్ చెప్పినా పోలీసులు మాత్రం ఆయనను లోపలికి పంపేందుకు ససేమిరా అన్నారు. హోటల్‌లో ఉన్న ఎమ్మెల్యేలు అనుమతిస్తేనే శివకుమార్‌ లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తామని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. హైడ్రామా నేపథ్యంలో హోటల్ యాజమాన్యం మంత్రి శివకుమార్ బుకింగ్ క్యాన్సిల్ చేసింది.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర

పోలీసులు తనను హోటల్‌లోకి అనుమతించకపోవడంపై కర్నాటక మంత్రి శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్‌లో రూం బుక్ చేసుకుని తన స్నేహితులను కలిసేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదని అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలంతా తనతో పాటు రాజకీయాల్లో కలిసి పుట్టారని, కలిసే చచ్చిపోతామని శివకుమార్ అన్నారు. ప్రస్తుతం తమ మధ్య చిన్న సమస్య వచ్చిందని అది త్వరలోనే పరిష్కారమవుతుందని చెప్పారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కర్నాటక సంక్షోభానికి కారణమని శివకుమార్ విమర్శించారు. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పోలీస్ చీఫ్‌కు రెబెల్ ఎమ్మెల్యేల లేఖ

పోలీస్ చీఫ్‌కు రెబెల్ ఎమ్మెల్యేల లేఖ

ఇదిలా ఉంటే శివకుమార్‌ను హోటల్ లోపలికి అనుమతించకపోవడానికి పెద్ద కారణమే ఉంది. ముంబై హోటల్‌లో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమకు హాని ఉందని, అందుకే భద్రత కల్పించాలని ముంబై కమిషనర్‌కు లేఖ రాశారు. తాము కర్నాటక నాయకులతో మాట్లాడదలుచుకోలేదని, వారు తమను కలవకుండా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు శివకుమార్‌తో పాటు శివలింగ గౌడను అడ్డుకున్నారు. మరోవైపు శివకుమార్‌తో పాటు జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడ హోటల్ వద్దకు చేరుకున్న వెంటనే మరో జేడీఎస్ నేత నారాయణ గౌడ అనుచరులు హోటల్ ముందు నిరసనకు దిగారు. శివకుమార్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

English summary
The Karnataka coalition crisis took a stunning turn today as senior Congress leader DK Shivakumar was stopped from entering the five-star hotel in Mumbai where rebel lawmakers are staying, after they wrote to the police for protection from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X