వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

35,000వేల అడుగుల ఎత్తులో విమానంలో యోగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైళ్లలో, యుద్ధ నౌకలతో పాటు విమానంలో కూడా యోగాసనాలు వేశారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. అయితే, స్పైస్ జెట్ విమాన సర్వీసుల్లో కొందరు యోగా గురువుల సమక్షంలో ప్రయాణీకులు ప్రత్యేకంగా ఆసనాలు వేశారు.

వీరు సముద్రమట్టానికి 35వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. ఢిల్లీ - గౌహతి మధ్య స్పైస్ జెట్ విమానంలో ఈ ఫీట్ నిర్వహించారు. యోగా దినం సందర్భంగా ప్రయాణీకులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. ట్విట్టర్‌లో ఇది హల్ చల్ చేస్తోంది.

High on Yoga@35000 Feet: Upa Yoga performed mid-air on selected SpiceJet flights

మోడీకి ఆరెస్సెస్ కితాబు

భారీస్థాయిలో విజయవంతంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేశారన్నారు.

భారతీయ ఆరోగ్య సోపానం యోగాకు మహా యోగం.. శతాబ్దాల భారత సంస్కృతీ సంప్రదాయాల్లో అవిభాజ్య భాగంగా కొనసాగుతూ వచ్చిన ఈ ఆరోగ్య ఆసన సాధనం ఇప్పుడు విశ్వ విఖ్యాతినార్జించింది.

ఇప్పటి వరకూ ఏవో కొన్ని దేశాలకే పరిమితమైన యోగా ఇప్పుడు అంతర్జాతీయ దినోత్సవమే అయింది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ ఐరాసలో యోగా విశిష్టతను వెల్లడించడం మొదలుకుని కేవలం మూడు నెలల కాలంలోనే యోగాకు అంతర్జాతీయ దినోత్సవ హోదా దక్కింది.

English summary
Budget carriers usually come up with "low fares" scheme to woo more passengers, but on the occasion of the inaugural International Day of Yoga, SpiceJet is giving on-board yoga classes on selected flights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X