• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు : 1000కిపైగా వీడియోలు.. మాజీ సీఎం, గవర్నర్, సినీతారల లీలలు

|

మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్‌ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ మంత్రులు, పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను సిట్ విచారిస్తోంది. బుధవారం 92 వీడియోలు అని వెలుగులోకి రాగా.. వాటి సంఖ్య వెయ్యికి చేరింది. ఆ వీడియోలతో బెదిరించి రూ.కోట్లు దండుకున్నారు. వీడియోలతోపాటు ఆడియో సంభాషణలు కూడా కలకలం రేపుతున్నాయి.

హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: బాలీవుడ్ స్టార్స్, మాజీ సీఎం, గవర్నర్‌, టాప్ పొలిటీషన్స్ విటులే!

ఎంపీనే కాదు ..

ఎంపీనే కాదు ..

సెక్స్ స్కాండల్ మధ్యప్రదేశ్‌కే పరిమితం కాదని సిట్ అధికారులు చెప్తున్నారు. ఐదుగురు మహిళలు ప్రధాన సూత్రధారులని.. కాలేజీ యువతులు, సెక్స్ వర్కర్లతో స్కాండల్ నిర్వహించారని తెలిపారు. ఇప్పటివరకు 200 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని మధ్యప్రదేశ్ సిట్ అధికారులు వివరించారు. సెక్స్ స్కాండల్ బీజేపీ, కాంగ్రస్ నేతలే ఉన్నారని సిట్ అధిపతి సంజీవ్ సమి పేర్కొన్నారు. యువతులు, సెక్స్ వర్కర్లతో భాగోతం నడిపిన ఐదుగురు పాత్రధారులు శ్వేత జైన్, బార్కా సోని, ఆర్తి దయాల్, ఆర్థి డ్రైవర్‌ను కూడా అదుపులోకి తసుకున్నారు. బర్కా సోని మాజీ కాంగ్రెస్ ఐటీ సెల్ అధికారి అమిత్ సోని భార్య అని సంజీవ్ తెలిపారు.

వీడియోలు తీసి..

వీడియోలు తీసి..

భోపాల్‌లో శ్వేత జైన్ ఎన్జీవో సంస్థ కోసం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇది బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్‌ది కావడం విశేషం. ఇక్కడ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ తమ వలలో పడిన మంత్రులు, అధికారుల వీడియోలు తీసి .. ఎన్జీవో సంస్థకు కోట్లు వసూల్ చేసినట్టు విచారణలో తేలింది. మధ్యప్రదేశ్‌తోపాటు మహారాష్ట్రలో కూడా సెక్స్ స్కాండల్ లింకులు ఉన్నట్టు గుర్తించారు. మధ్యప్రదేశ్ మాజీ మంత్రిని విశ్వసించి తమ చీకటి సామ్రాజ్యాన్ని మహారాష్ట్ర వరకు విస్తరించారు.

మధ్యతరగతి వారే..

మధ్యతరగతి వారే..

24 మంది విద్యార్థినిలను తమ స్కాండల్ పాల్గొన్నారని శ్వేత పోలీసుల విచారణలో తెలిపారు. వీరంతా మధ్యతరగతికి చెందినవారేనని.. డబ్బు కోసమే తమతో చేతులు కలిపారని వివరించారు. మరికొందరు లగ్జరీ లైఫ్ గడిపేందుకు కోసం తమ బృందంలో చేరారని వివరించారు. బుధవారం నాటికి లైంగికదాడులకు సంబంధించి 92 వీడియోలు అని ప్రాథమికంగా తెలిసింది. కానీ అవి వెయ్యి వరకు ఉన్నాయని తెలుస్తోంది. ఆ వీడియోలను చూపిస్తూ మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్లను బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. శ్వేత జైన్ భర్త ల్యాప్ టాప్, ఇతర ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

వీడియో తీసి..

వీడియో తీసి..

ఆ వీడియోలో ఉన్న మహిళ ఒక్కొక్కరు తమ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొన్నారని తెలిపారు. అందులో ఒక మహిళ ఐఏఎస్ అధికారిని రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. లేదంటే వీడియో విడుదల చేస్తామని బెదిరించినట్టు సమాచారం. మరోవైపు ఇండోర్ మున్సిపల్ అధికారిని రూ.3 కోట్లు ఇవ్వాలని కూడా బెదిరించారు. దీంతో ఆర్తి దయాల్ రూ.50 లక్షలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. ఇదే కేసులో మిగతావారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
dozen top bureaucrats and eight former ministers of Madhya Pradesh are being investigated in a high profile extortion racket in which over 1,000 clips of sex chats, explicit videos and audios have been found from computers and mobile phones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more