వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుల ముఖాల్లో ఆనందం చూడాలి: యునెస్కోలో మోడీ

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడంలో యునెస్కోది కీలక పాత్ర అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోడీ శుక్రవారం యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు. యునెస్కో 70వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించడం గొప్ప గౌరవమని ఆయన తెలిపారు.

సాంకేతికత, విద్యా, సైన్స్ రంగాల అభివద్దిలో భారత్, యునెస్కో దూరదృష్టితో ఉన్నాయని చెప్పారు. యునెస్కో ఆవిర్భావం నుంచి మన బంధం దృఢమైనదని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలు తక్షణ అవసరమని మోడీ అన్నారు. అనేక రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నామన్న ప్రధాని.. వాటిలో పురోగతి కూడా ఉందని తెలిపారు.

 Highlights: What PM Narendra Modi said at UNESCO Headquarters in Paris

మన సామూహిక లక్ష్యంగా ప్రశాంత, సౌభాగ్య భవిష్యత్ సాధనే కావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆడ పిల్లలందరూ బడికెళ్లి చదువుకోవాలని అన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత నైపుణ్యం కోసం బృహత్ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. యువతను మేల్కొల్పడం కోసమే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలని చెప్పారుు.

వృద్ధిని గణాంకాల్లో చెప్పుకోవడం కాదు.. సామన్యుల ముఖాల్లో ఆనందం చూడాలని అన్నారు. శాశ్వత శాంతి కోసం విద్య ప్రధానమన్న మహాత్మా గాంధీ వ్యాఖ్యలను మోడీ గుర్తు చేశారు. ఈ సందేశాన్ని అప్పట్లోనే గాంధీ యునెస్కోకు ఇచ్చారని తెలిపారు. వారసత్వ సంపద పరిరక్షణలో యునెస్కో చొరవ భారత్‌కు స్ఫూర్తినిస్తుందన్నారు. సంస్కృతి ప్రపంచం మొత్తాన్ని కలుపుతుందన్నారు.

English summary
PM Narendra Modi, who landed in Paris on late Thursday night, addressed the United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X