వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

59 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు: వీరంతా వృత్తి నిపుణులే, 41 శాతం మందికే కొలువులు...

|
Google Oneindia TeluguNews

అసలే ఆర్థిక మాంద్యంతో ఉద్యోగులు బిక్కుబికుమంటున్న సమయంలో.. కరోనా కాటేస్తోంది.వైరస్ విజృంభణతో ప్రపంచంలో అన్నీరంగాలు కుదేలైపోయాయి. కొత్త ప్రాజెక్టులు లేక, చేతిలో పని లేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగులను తీసి వేస్తున్నాయి. ఇక జీతాల్లో కోత గురించి అయితే చెప్పక్కర్లేదు. కరోనా వైరస్ వల్ల వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చారు. ఇలా వచ్చిన వారిలో ఎక్కువమంది ఉపాధి కోల్పోవడంతోనే స్వదేశ బాట పట్టారని తెలుస్తోంది.

మొన్న హరీష్ సిబ్బంది, నిన్న మేయర్ డ్రైవర్, నేడు ముత్తిరెడ్డి.!తెలంగాణను కరోనా కాటేస్తోందా.? మొన్న హరీష్ సిబ్బంది, నిన్న మేయర్ డ్రైవర్, నేడు ముత్తిరెడ్డి.!తెలంగాణను కరోనా కాటేస్తోందా.?

ఇదిగో వివరాలు

ఇదిగో వివరాలు

ఇటీవల దేశం తిరిగొచ్చిన వారి వివరాలను స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రిన్యూస్ షిప్ మంత్రిత్వశాఖ, పౌరవిమానయాన శాఖ, హోంశాఖతో సమన్వయం చేసుకొని ‘స్వదేశ్' పేరుతో వివరాలను వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చినవారు గురించి స్వదేశ్ పేరుతో డాక్యుమెంట్స్ ఇచ్చి ఫిలప్ చేయించారు. అందులో పని, ఉద్యోగం, కంపెనీ పేరు, ఎన్నెళ్ల నుంచి పనిచేస్తున్నారనే వివరాలు ఉన్నాయి.

59 శాతం మంది

59 శాతం మంది

ఈ నెల 7వ తేదీ వరకు 15 వేల 634 మంది విదేశాల నుంచి వచ్చినవారు స్వదేశ్ ఫామ్ నింపారు. అందులో 59 శాతం అంటే 9 వేల 222 మంది ఉద్యోగాలను కోల్పోయారు. కేవలం 6 వేల 412 మంది మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థికమాంద్యం, కరోనా వైరస్ వల్ల కంపెనీలు మానవ వనరులను తగ్గించుకుంటుండగా.. భారతీయులు కూడా వెనక్కి వచ్చేందుకు మొగ్గ చూపిస్తున్నారు.

Recommended Video

Vijay Mallya Hasn't Been Extradited, No Word From UK Authorities
47 శాతం 10 ఏళ్ల కంటే

47 శాతం 10 ఏళ్ల కంటే

ఇందులో 47 శాతం మంది గత పదేళ్లు అంత కన్నా ఎక్కువ ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. 27 శాత మంది మాత్రం 5 నుంచి 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. 2-5 ఏళ్లలోసే కేవలం 18 శాతం మంది మాత్రమే పనిచేస్తున్నారు. రెండేళ్ల కన్నా తక్కువ అనుభవం ఉన్న వారు 8 శాతం మంది ఉన్నారు. స్వదేశం తిరిగి వచ్చిన వారు ఉన్నత చదువు చదివిన వారే. ఇందులో 7 వేల 371 మంది గ్రాడ్యుయేట్లు కాగా.. 2 వేల 937 మంది ఇంటర్ చేసిన వారు ఉన్నారు. పీజీ చేసిన వారు కూడా 2 వేల 638 మంది ఉన్నారు. పదో తరగతి చదివినవారు 2 వేల 111 మంది ఉన్నారు. కేవలం 4 శాతం మంది మాత్రమే పది కన్నా తక్కువ చదువుకున్నారని పేర్కొన్నారు.

English summary
59 %: Fifty nine per cent of the migrant workforce returning to India on the Vande Bharat Mission flights from overseas have lost their jobs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X