India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైభీమ్ వర్సెస్ జై శ్రీరాం: కాలేజ్ క్యాంపస్‌లో కొత్త మలుపు తీసుకున్న హిజబ్ వ్యవహారం..!!

|
Google Oneindia TeluguNews

కర్నాటకలో హిజబ్ (ముస్లిం మహిళలు ముఖాన్ని కప్పుకునే వస్త్రం) వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా ఇది మరో మలుపు తీసుకుంది. చిక్కమంగళూరు జిల్లాలోని ఐడీఎస్‌జీ కాలేజ్ విద్యార్థులు కొందరు నీలంరంగు షాలువాలు ధరించి హిజబ్ ధరించిన ముస్లిం మహిళలకు మద్దతుగా నిలిచారు. జై భీమ్ నినాదాలు చేస్తూ విద్యకు మతం రంగు పులమడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా నినాదాలు చేస్తుండగానే కాషాయ రంగు షాలువాలతో మరో వర్గం విద్యార్థులు వచ్చి జైశ్రీరాం నినాదం చేశారు. జైభీమ్ విద్యార్థుల వర్గం, జైశ్రీరాం విద్యార్థుల వర్గం మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

రెండు వర్గాలకు చెందిన విద్యార్థుల వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక కర్నాటకలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని, హిజబ్ ధరించిన వారికి, కాషాయం శాలువా ధరించిన వారిని సీఎం బసవరాజ్ బొమ్మయ్, మరియు విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కోరారు. ఎవరెన్ని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. సంయమనం పాటించాలని సీఎం బసవరాజ్ బొమ్మయ్ కోరారు. యూనిఫారంలు ధరించాలన్న ప్రభుత్వ ఆదేశాలను విద్యార్థులు తప్పకుండా పాటించాలని ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న బసవరాజ్ బొమ్మయ్ కోరారు. విద్యార్థులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని చెప్పారు. కర్నాటక రాష్ట్రం చాలా శాంతియుతమైన రాష్ట్రమని, శాంతియుత వాతావరణంను విఘాతం కలిగిలా వ్యవహరించరాదని చెప్పారు.

Hijab Row:Its now Jai Bhim vs Jaishriram,students wear blue and saffron shawls-video viral

ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉన్నందున మంగళవారం తుది తీర్పు వెలువడుతుందని.. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామని సీఎం బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. హిజబ్ వ్యవహారంపై విద్యార్థులను కొన్ని శక్తులు తెరవెనక ఉండి రెచ్చగొడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం బొమ్మయ్.అంతకుముందు ఇలాంటి ఘటనలే కేరళ మహారాష్ట్రలో జరిగాయని బొమ్మయ్ గుర్తుచేశారు. ఇదిలా ఉంటే మైసూరులో మీడియాతో విద్యాశాఖ మంత్రి నగేష్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విద్యార్థులు స్కూళ్లకు కాలేజీలకు యూనిఫారంలోనే రావాలని లేదంటే వారిని క్యాంపస్‌లోకి అనుమతించేది లేదని చెప్పారు. కాలేజ్ క్యాంపస్ గేట్ దగ్గరకు వచ్చే వరకు ఎలాంటి దుస్తులైన విద్యార్థులు ధరించొచ్చని... ఒక్కసారి క్యాంపస్ గేటులోకి అడుగుపెట్టాక యూనిఫారం ధరించాలని నగేష్ చెప్పారు.

ఇదిలా ఉంటే కుండాపూర్ గవర్నమెంట్ ప్రీ యూనివర్శిటీ కాలేజీ యాజమాన్యం హిజబ్ ధరించి వచ్చిన విద్యార్థులను ఒక గదిలోకి, కాషాయ రంగు శాలువలు ధరించి వచ్చిన విద్యార్థులను మరో గదిలోకి పంపింది. బయట ఉండి నిరసన తెలుపుతున్న ముస్లిం విద్యార్థులను కాలేజీకి అనుమతిస్తామని అయితే తరగతి గదిలోకి మాత్రం అనుమతించేది లేదంటూ కాలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ప్రతినిధి మోహన్ దాస్ షెనాయ్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హిజబ్‌ను తొలగిస్తేనే తరగతి గదిలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇక హిజబ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వ్యాపించింది. ఇ:దులో చిక్కబళ్లాపూర్, చిక్కమగళూరు, హసన్, మాండ్యా, విజయ్‌పురాలో దీని ప్రభావం కనిపిస్తోంది.

Pushpa స్టైల్ దింపేసిన స్మగ్లర్.. షాకిచ్చిన మహారాష్ట్ర పోలీస్ | Oneindia Telugu

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తమకు పనిలేదంటూ... తామంతా కర్నాటక హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నామంటూ హిజబ్ ధరించిన ముస్లిం విద్యార్థులు చెప్పుకొచ్చారు.

English summary
The Hijab row have taken a new twist with Students of Jaibhim coming in blue shawls in support of Muslim students wearing Hijab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X