India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hijab వ్యవహారం: ముస్లిం మహిళలు ఏం ధరిస్తే మీకేంటి.. మీరు అలా ఉండాలంటే ఉండొచ్చు: ఓవైసీ

|
Google Oneindia TeluguNews

కర్నాటకలో చోటు చేసుకున్న హిజబ్ వ్యవహారం దేశంలో పెను తుఫాను సృష్టిస్తోంది. అసలే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ఇక పార్లమెంటులో సైతం హిజబ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల వేళ హిజబ్ వ్యవహారం బీజేపీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది. మొన్న అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులతో వేడెక్కిన యూపీ రాజకీయం తాజాగా హిజబ్ వ్యవహారం కూడా అక్కడి రాజకీయాలను ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారికి ధీటైన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కర్నాటకలో హిజబ్ వ్యవహారం ముదురుతున్న వేళ సీఎం బసవరాజ్ బొమ్మయ్ అక్కడి స్కూళ్లకు కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులను ప్రకటించారు. ఇదిలా ఉంటే కర్నాటక హైకోర్టులో హిజబ్ వ్యవహారంపై ఐదుగురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం రోజున విచారణ ప్రారంభం అయ్యింది. కోర్టులో కేసు విచారణలో ఉండగానే ఓవైసీ కర్నాటక ప్రభుత్వం బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు ఏం ధరించాలో, ఏం ధరించకూడదో చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించారు. మీరు ఏం ధరించకుండా ఉండాలనుకుంటే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండంటూ ఫైర్ అయ్యారు ఓవైసీ. ఇది పూర్తిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15,19 మరియు 21ని ఉల్లంఘించినట్లే అవుతుందని అన్నారు.

Hijab row:What do you have to do with what our Muslim women wear: Owaisi slams Karnataka Govt

అసదుద్దీన్ ఓవైసీ గడ్డంతో మరియు తలపై టోపీతో పార్లమెంటులోకి వెళ్లగా లేనిది... ముస్లిం ఆడపిల్లలు హిజబ్ ధరించి కాలేజీకి వెళితే తప్పేంటని ప్రశ్నించారు. కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఓవైసీ. హిజబ్ వ్యవహారంతో కర్నాటకలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఉడిపి, షిమోగా, బాగల్‌కోట్ ప్రాంతాల్లో అయితే పరిస్థితి చేదాటింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. కొన్ని చోట్ల వాతావరణం హింసాత్మకంగా మారింది. హింసాత్మక ప్రాంతాల్లో పలువురు పోలీసులకు విద్యార్ధులకు గాయాలైనట్లు తెలుస్తోంది. దావణగెరిలో చాలా చోట్ల ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతను చేపట్టారు.

English summary
AIMIM Chief and Hyderabad MP slammed Karnataka govt over the Hijab issue in poll bound Uttar Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X