వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిజ్రాల్లో పరిమళించిన మానవత్వం: నిత్యవసరాల వస్తువులతో కిట్, పేదలకు 1500 కిట్ల అందజేత..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుండటంతో పేదలను ఆదుకునేందుకు కొందరు చొరవ చూపిస్తున్నారు. సమాజంలో ఉన్నత వర్గాలు ఆర్థికసాయం, వస్తువులు అందజేస్తున్నారు. అయితే గుజరాత్‌లో కొందరు హిజ్రాలు కూడా సాయం చేశారు. వస్తువుల కిట్లను అందజేసి.. తాము కూడా మేము సైతం అంటూ కదం కలిపారు. వైరస్ ప్రబలుతోన్న వేళ హిజ్రాల చొరవను పలవురు అభినందిస్తున్నారు.

సాధారణంగా హిజ్రాలు అంటే బలవంతంగా లాక్కుంటారు. అదీ షాపులోనైనా, రోడ్డుపైనైనా, రైళ్లలో కూడా.. కానీ సూరత్‌లో మాత్రం కొందరు హిజ్రా జాతికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 150 మంది వరకు కలిసి పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. నిత్యావసర వస్తువులతో కలిసి కిట్ తయారుచేశారు. కాలనీలో గల పేదలకు వస్తువులను అందజేసి.. తమలో కూడా మానవతా ఉందని చాటుకొన్నారు.

hijras donate 1500 kits for poor people..

హిజ్రాలు అందజేస్తోన్న కిట్‌లో బియ్యం, పిండి, మంచినూనె, టీ పొడి, చక్కెర తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. సూరత్ మురికివాడ, ఇతర చోట్లలో గల పేదలకు ఆ కిట్లను అందజేశారు. వాస్తవానికి తాము 200 కిట్లను పేదలకు అందజేయాలని అనుకొన్నామని హిజ్రా ప్రతినిధి నిషా తెలిపారు. కానీ అది 1500 చేరుకున్నదని చెప్పారు. వాస్తవానికి ఆ సరుకులు తమ కోసం దాచుకున్నవని.. నవరాత్రి సందర్భంలో ఉపయోగిస్తామని పేర్కొన్నారు. కానీ కరోనా వైరస్ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు రద్దు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ వస్తువులను పేదలకు అందజేస్తే మేలు చేసినవారిమి అవుతామని చెప్పారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

English summary
hijras donate 1500 kits for slum area poor people in gujrat surat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X