వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీ సంచలనం: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి వెనుక ట్రంప్-రష్యా ఒప్పందం!..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. తప్పక గెలిచి తీరుతుందనుకున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ ఓటమిపాలవడం తీవ్ర చర్చయానీంశంగాను మారింది. ఇప్పటికీ ట్రంప్ గెలుపుపై అక్కడక్కడా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా అమెరికన్ ఎన్నికలను రష్యా ప్రభావితం చేసినందువల్లే ట్రంప్ గెలుపు సాధ్యపడిందనేది చాలా మంది వ్యక్తం చేసిన అనుమానం. దీనికి బలాన్ని చేకూర్చేలా అక్కడి మీడియా నుంచి కథనాలు వెలువడ్డాయి. యూఎస్ ఎలక్టోరల్ సిస్టమ్ ను హ్యాక్ చేసి ట్రంప్ గెలిచేందుకు రష్యా సహకరించదనేది అందులో ప్రధాన ఆరోపణ.

<strong>సంచలనం: యూఎస్ ఎన్నికల్లో హ్యాకింగ్.. హిల్లరీ ఓటమి వెనుక పుతిన్ హస్తం!</strong>సంచలనం: యూఎస్ ఎన్నికల్లో హ్యాకింగ్.. హిల్లరీ ఓటమి వెనుక పుతిన్ హస్తం!

తాజాగా హిల్లరీ క్లింటన్ సైతం ఈ ఆరోపణలను సమర్థించారు. తన ఓటమికి రష్యా జోక్యం, సొంత పార్టీ వ్యవహారం,ఎఫ్‌బిఐ మీడియాతో పాటు ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో తీసుకున్న ప్రతీ నిర్ణయానికి తానే బాధ్యురాలినని, ఆ కారణాలు తన ఓటమికి ఎంతమాత్రం కారణం కాదని అన్నారు. ట్రంప్ అనుయాయిల సహకారంతో తప్పుడు ప్రచారంలో ఆరితేరిన రష్యా వల్లే ఓటమి పాలైనట్లు పేర్కొన్నారు.

Hillary Clinton says 'Americans' guided Russia's attack on her campaign

ట్రంప్ ప్రచారం బృందం సహా ఆయన అనుచరులకు రష్యాతో ఉన్న సంబంధాలు.. ఎన్నికలకు ముందు నుంచే వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇక తన ఈమెయిల్స్ వ్యవహారాన్ని మీడియా అనవసర రాద్దాంతం చేసిందన్నారు హిల్లరీ. మరోవైపు ట్రంప్ మాత్రం హిల్లరీ ఆరోపణలను యథావిధిగా కొట్టిపారేశారు.

మోసకారి అయిన హిల్లరీ తన ఓటమికి ప్రతీ ఒక్కరిని నిందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. తానో భయంకరమైన అభ్యర్థినని హిల్లరీ ఎందుకు చెప్పడం లేదని అన్నారు. తన ప్రచార బృందానికి రష్యాతో ఎటువంటి సంబంధాలు లేవని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. హిల్లరీ చేస్తున్న ఆరోపణలకు రష్యా నవ్వుకుని ఉండవచ్చునని ఎద్దేవా చేశారు.

English summary
Hillary Clinton says Russian hackers were "guided by Americans" in their assault on her presidential campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X