వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 రోజుల కింద ట్రెక్కర్ అదృశ్యం: లోయలో శవమై తేలాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

ధర్మశాల: మూడు రోజుల క్రితం అదృశ్యమైన 19 ఏళ్ల ట్రెక్కర్ శవమై తేలాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఓ లోతైన లోయలో అతని శవం సోమవారంనాడు కనిపించింది.

స్థానికుడైన అభినవ్ కుమార్ 12 కిలోమీటర్ల హిమానీ చాముంండకు ట్రెక్కింగ్ కోసం బయలుదేరాడు. అది ధౌలాధర్ పర్వత శ్రేణిలో 13 వేల కిలోమిటర్ల ఎత్తులో ఉంటుంది. అతను మార్చి 16వ తేదీన ఏడుగురు మిత్రులతో కలిసి బయలుదేరాడు.

Himachal: 19-yr-old trekker missing for 3 days ago, body found in deep trench

అయితే, అతను మధ్యలో తప్పిపోయాడు. ఈ విషయంపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ సంతోష్ పాటియాల్ తెలిపారు. ఏడుగురిలో ముగ్గురు తొలత కొండపైకి చేరకున్నారని, మిగతా వాళ్లు ముందుకు సాగుతూ వచ్చారని, అభినవ్ కొండపైకి చేరి ఉంటాడని భావించారని ఆయన వివరించారు.

తమకు ఫిర్యాదు అందగానే బృందాలను రంగంలోకి దింపామని చెపరు. ఆదివారం తమకు అతని ఆచూకీ తెలియలేదని, సోమవారం 100 మీటర్ల లోతులో అతని శవం కనిపించిందని చెప్పారు.

English summary
The body of a 19-year-old trekker, who had gone missing three days ago, was found on Monday in a deep trench at Dharamshala in Himachal Pradesh, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X