
HimachalPradesh Elections 2022: ఆ 20 వేల ఓట్లే బీజేపీ రాతను మార్చాయి..
గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గుజరాత్ లో గెలువగా.. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసింది. గుజరాత్ లో బీజేపీ 56 సీట్లతో చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ 17 సీట్లకే పరిమితం కాగా ఆప్ 5 సీట్లు గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 40 స్థానాలు దక్కించుకోగా బీజేపీ 25 సీట్లకే పరిమితమైంది. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య 0.9 శాతమే ఓట్ల తేడా ఉంది.

20 వేల ఓట్లు
కేవలం 20 వేల ఓట్లు మాత్రం రెండు పార్టీల మధ్య తేడా. 15 మంది కాంగ్రెస్ అభ్యర్థులు 2 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ గెలుపు కాంగ్రెస్ కు ఊపిరి పోసిందని చెప్పొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించినందకు రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎటు వెళ్లకుండా చండీగఢ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య పేరుతో పాటు ముకేశ్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సుఖు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఒక్కశాతం
హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్కశాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపోటములు జరిగాయన్నారు ప్రధాన మంత్రి మోడీ. ఇంత తక్కువ ఓట్ల శాతంతో గతంలో గెలుపోటములు ఎప్పుడూ జరగలేదన్నారు. బీహార్ ఉపఎన్నికలోనూ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది బీజేపీకి మంచి సూచన అని అన్నారు.

ఇండియా ఫస్ట్
ఇండియా ఫస్ట్ అనేది తమ నినాదమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో పేదరికం తగ్గుతోందని నిపుణలు చెబుతున్నారన్నారు. మా ప్రతి నిర్ణయం వెనుక సుదూర లక్ష్యం ఉంటుంది. పేదరికాన్ని పారద్రోలేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. విద్వేషాలు రెచ్చగొడితే తాత్కాలిక ప్రయోజనాలే ఉంటాయి. విజయానికి షార్ట్ కట్ లు ఉండవని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. దేశానికి ఎప్పుడు ఏ సవాల్ ఎదురైనా.. ప్రజల నమ్మం బీజేపీపైనే ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.