వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన హిమాచల్ పోలింగ్: 74శాతం ఓటింగ్, 18న లెక్కింపు

హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్‌ గురువారం సాయంత్రం ముగిసింది. సుమారు 74శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Himachal Pradesh Assembly Elections 2017 Updates | Oneindia Telugu

సిమ్లా: గురువారం సాయంత్రం 5గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసింది. సుమారు 74శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. సాయంత్రం 5గంటలకు ముగిసింది. 68 నియోజకవర్గాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సిర్మూర్‌ జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం యంత్రం మొరాయించడంతో అక్కడ ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

Himachal Pradesh Elections: Polling ends, 74% voting recorded

సిమ్లా పట్టణంలో అత్యధికంగా 66శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిసింది. సీఎం వీరభద్రసింగ్‌, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌, కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్‌తో పాటు పలువురు ప్రముఖులు తమ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Himachal Pradesh Elections: Polling ends, 74% voting recorded

ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు రసీదు యంత్రాలను(వీవీప్యాట్‌) ఉపయోగించారు. ఈ మేరకు వివరాలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ దీపక్ సక్సేనా వెల్లడించారు. కాగా, ఓట్ల లెక్కింపు డిసెంబరు 18న చేపట్టనున్నారు.

English summary
Close to 74 per cent votes were cast on Thursday for the 68-seat Himachal Pradesh Assembly as voting picked up pace in the afternoon, Deputy Election Commissioner Deepak Saxena said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X