వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: అత్యంత భయానకంగా -కొండచరియలు పడి భారీగా టూరిస్టుల దుర్మరణం, మోదీ సంతాపం

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం నుంచి మెల్లగా తేరుకుంటోన్న జనం సరదాగా కొండ ప్రాంతాల్లో పర్యటనకు వెళుతున్నారు. కానీ భారీ వర్షాలు, అనూహ్యంగా మారుతోన్న వాతావరణం వారి పాలిట శాపంగా పరిణమించింది. జనసమర్థం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు భారీగా ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. వివరాలివి..

ఏలూరు మేయర్‌గా మళ్లీ నూర్జహాన్ -పవన్-బీజేపీ తుస్, టీడీపీకి 3 -ఎన్నికల పూర్తి ఫలితాలివేఏలూరు మేయర్‌గా మళ్లీ నూర్జహాన్ -పవన్-బీజేపీ తుస్, టీడీపీకి 3 -ఎన్నికల పూర్తి ఫలితాలివే

ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం ఘోర దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడి టూరిస్టు కేంద్రమైన కిన్నౌర్ జిల్లాలోని సంగాల్ లోయలో పలు చోట్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఆదివారం కావడంతో ఆ మార్గంలో పర్యాటకుల వాహనాలు భారీగా కొలువుదీరిన సమయంలోనే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి..

Himachal Pradesh landslide video: At least 9 tourists killed, bridge collapse, pm modi grief

వందల అడుగుల ఎత్తు నుంచి పెద్ద పెద్ద రాళ్లు బంతుల మాదిరిగా దొర్లుకుంటూ వచ్చి రోడ్డుపైనున్న వాహనాలపై పడ్డాయి. సంగాల్ లోయలో కీలకమైన వంతెనపై రాళ్లు పడటంతో అది ఒక్కసారిగా ధ్వంసమైపోయింది. పదుల సంఖ్యలో వాహనాలు, పర్యాటకుల విశ్రాంతి గదులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ భయానక దృశ్యాల తాలూకు వీడియో ప్రస్తుతం వైరలైంది.

సాయిరెడ్డి, సజ్జల మధ్య ఆధిపత్య పోరు -జగన్ 100 తప్పులను మోదీ కాస్తారా? -వైసీపీ ఎంపీ రఘురామ తాజాసాయిరెడ్డి, సజ్జల మధ్య ఆధిపత్య పోరు -జగన్ 100 తప్పులను మోదీ కాస్తారా? -వైసీపీ ఎంపీ రఘురామ తాజా

హిమాచల్ ప్రదేశ్ కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటివరకు 9 మంది పర్యాటకులు చనిపోయారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ఆ రాష్ట్ర మంత్రి జైరాం ఠాకూర్ తెలిపారు. చనిపోయిన ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఐటీబీపీ జవాన్ల బృందాలు తరలివెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి.

కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడి టూరిస్టులు చనిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి ద్వారా మరణించిన వారి కుటుంబీకులకు రూ.2లక్షల చొప్పున, గాయపడినవారిని రూ.50 వేల చోప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తామని పీఎంవో ఒక ప్రకటన చేసింది.

English summary
At least nine tourists were killed and three others were injured in multiple landslides that took place on Sunday in Himachal Pradesh's Kinnaur district. The tourists were travelling in a vehicle on which heavy boulders fell killing nine of 11 tourists, reports said. Indo-Tibetan Border Police teams have been pressed to rescue work. Prime Minister Narendra modi expresses condolenceand ex gratia of ₹2 lakh each from PMNRF. Scary visuals show landslide, bridge collapse in Himachal's Kinnaur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X