వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోంలో బీజేపీ గెలుపు వెనుక: ఎవరీ హేమంత్ బిశ్వ శర్మ?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అసోంలో పదిహేనేళ్ల తరుణ్‌ గొగోయ్ పాలనకు ఉద్వాసన పలుకుతూ ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో 80 స్థానాల్లో విజయం సాధించి 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో అసోంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే అసోంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో అసోంలోని బీజేపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అసోంలో కమలం వికసించడంలో కీలక పాత్రను పోషించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యం కలగమానదు.

ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్) వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్న హేమంత్ బిశ్వ శర్మ. శర్మ 2015 ఆగస్టులో బీజేపీలో చేరారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు అసోంలో బీజేపీని అధికారంలోని తీసుకురావడంలో ఎంతగానో కృషి చేశారు. శర్మతో పాటు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా బీజేపీకి బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు.

2014 సాధారణ ఎన్నికల్లో అసోంలో బీజేపీ అద్భుత విజయం సాధించే దిశగా సోనోవాల్ నడిపించారు. ఆ తర్వాత అక్కడ బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నప్పటికీ 2016 ఎన్నికల్లో ఆధిక్యత వచ్చే విధంగా చేసింది మాత్రం హిమంత బిశ్వ శర్మే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన స్వయంకృషితో ఎదిగారు.

Himanta Biswa Sarma: BJP's Prashant Kishor for Assam

తాజా ఎన్నికల్లో అసోంలోని జలుక్ బరి నియోజకవర్గం నుంచి 90వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అసోం ఘన పరిషత్, అసోం స్టుడెంట్స్ యూనియన్లలో కూడా ఆయన పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తరుణ్ గొగోయ్‌కు కుడిభుజంలా వ్యవహారించాడు.

అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో శర్మకు గొప్ప ప్రజాదరణ ఉంది. నిజానికి ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరతారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తన కుమారుడిని రాజకీయాల్లో తీర్చిదిద్దే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌లో ఇమడలేకే బీజేపీలో చేరారు.

అంతేకాదు బీజేపీలో చేరిన శర్మకు ఆ పార్టీ ఎంతో ప్రత్యేకతను ఇచ్చింది. అసోం ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవానికి అసోంలో బీజేపీ ఇంత ఘన విజయాన్ని ఊహించి వుండకపోవచ్చు. అసోంలో బీజేపీ ఏకంగా 30.3 శాతం ఓట్ షేర్ (2011లో 11.47 శాతం) సాధించింది.

English summary
At 8am on the morning of the second phase of polling in Assam on 11 April, Guwahati’s usually congested roads are empty. Every few blocks, long lines of voters, who have been queuing before 6am, break the calm. Inside the drawing room of Himanta Biswa Sarma’s opulent house on Zoo Road, well-wishers wait to greet him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X