వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదికి ఉత్తర భారతీయుల వలసలు, పెరుగుతున్న బెంగాళీ, హిందీ ప్రాబల్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

దక్షిణాదిన పెరుగుతున్న బెంగాళీ, హిందీ ప్రాబల్యం

న్యూఢిల్లీ: దక్షిణాదిన హిందీ, బెంగాళీ, ఒడిశా భాషలు మాట్లాడే వారు క్రమంగా పెరుగుతున్నారు. ఓ వైపు ఉత్తరాదిన తమిళం, మలయాళం మాట్లాడే జనాభా తగ్గుతుంటే, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హిందీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా తదితర భాషలు మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

2011 జనాభా మాతృభాషా గణాంకాలు వెల్లడయ్యాయి. గతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి ఎక్కువగా వలసలు వెళ్లేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు ఉత్తరాది వారు దక్షిణాదికి బాట పడుతున్నారు.

ఒకప్పుడు దక్షిణాది వారికి గమ్యస్థానంగా ఉన్న ముంబైలో ఇప్పుడు కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మాట్లాడేవారు తగ్గారు. ఉత్తరాదిన 2001 నుంచి 2011 వరకు మలయాళీయుల సంఖ్య పెరుగుదల ఉన్నది మాత్రం ఉత్తర ప్రదేశ్‌లో. నోయిడా కేంద్రంగా ఐటీ కంపెనీ ఉండటంతో ఈ పరిస్థితి.

Hindi, Bengali, Odia speakers surge in South India

తమిళ, మలయాళీలు ఉత్తరాది వైపు కంటే దక్షిణాదిలోనే మరో రాష్ట్రానికి.. ముఖ్యంగా కర్ణాటక వైపు వెళ్తున్నారు. 2001 మరియు 2011 లెక్కలు తీసుకుంటే తమిళులు, మలయాళీలు ఢిల్లీకి వెళ్లడం తగ్గింది.

తమిళ ప్రజల పెరుగుదల గురుగ్రామ్ కారణంగా హర్యానాలో కనిపించింది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హిందీ మాట్లాడేవారు ఎక్కువగా కర్ణాటక, ఏపీలలో ఉన్నారు.

English summary
Tamil and Malayalam speaking populations are falling across most states in north India even as Tamil Nadu and Kerala are seeing a huge jump in the number of Hindi, Bengali, Assamese and Odia speakers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X