వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హద్దులు చెరిపిన దాతృత్వం : ముస్లిం శ్మశానవాటికకు ఉదారంగా భూమిచ్చిన హిందువు

|
Google Oneindia TeluguNews

డిస్పూర్ : దేశంలో కొన్ని చోట్ల మతం కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పటికీ కొన్నిచోట్ల హిందు, ముస్లింల మధ్య సఖ్యత ఉండటం లేదు. కానీ అసోంలో మాత్రం ఓ కుటుంబం మతం దేహనికే తప్ప దేశానికి కాదని నిరూపించింది. ముస్లింల శ్మశాన వాటికకు సొంత భూమిచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది.

ఉదారత ..

ఉదారత ..

ఇంటి వద్ద జానెడు జాగ కోసం కొట్టుకోవడం తెలుసు, పొలంలో గెట్టు వద్ద అడుగు స్థలం కోసం రక్తం ఏరులై పారిన ఉదంతాలు తెలుసు. కానీ అసోంలోని లక్ష్మీపూర్ జిల్లాలో ఓ కుటుంబం మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది. గొరెహా గ్రామంలో దివంగత కరుణకాంత భుయాన్ ఫ్యామిలీ కొంత భూమి ఉంది. 0.84 ఎకరాల భూమి చేస్తే వ్యవసాయం, తోట చేయొచ్చు కానీ వారు అలా చేయలేదు. స్థానిక ముస్లింలు కోరితే తమ భూమి ఇచ్చి .. తమ మధ్య మతాల హద్దులను చెరిపేశారు.

అడగ్గానే ...

అడగ్గానే ...

స్థానిక నహర్ వుఖురి కబరస్ధాన్ (శ్మశాన వాటికి) భూమి చాలలేదు. దీంతో పక్కనే ఉన్న భుయాన్ కుటుంబాన్ని భూమి కావాలని అడిగారు. ఆ వెంటనే వారు తమ భూమిని శ్మశానికి ఇచ్చేశారు. అయితే ఇందుకోసం వారు ఒక్క రుపాయి కూడా తీసుకోకుండా ఉదారంగా ఇచ్చేసి ... పలువురి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. తాము అడగ్గానే భూమి ఇచ్చిన భుయాన్ కుటుంబానికి కమిటీ కృతజతలు తెలిపింది. ఈ రోజుల్లో .. అదీ కూడా శ్మశానం కోసం భూమిని దారాదత్తం చేయడంపై పలుువురు కొనయాడుతున్నారు.

సన్మానం ....

సన్మానం ....

గ్రామంలో ముస్లింలు శ్మశానం లేక ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో నిర్మించుకొనేందుకు ముందుకొస్తే .. భుయాన్ కుటుంబం చూపిన దాతృత్వానికి ఫిదా అయిపోయారు. అడగ్గానే భూమి ఇచ్చిన భుయాన్ కుటుంబాన్ని కమిటీ సభ్యులు సన్మానించి గౌరవించారు. పలువురు ముస్లింలు భుయాన్ కుటుంబం చేసిన మంచిపనిని మనసారా స్వాగతించారు. గ్రామంలో జరిగిన మంచి ఘటనను మేధావులు, ప్రజాసంఘాలు కూడా ప్రశంసించారు. ఇలాంటి వారి చేసే మంచి పని మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.

English summary
A family in Lakshmipur district is an example for everyone else in associate. The Bhuyan family in Gorega village has some land. A 0.84 acre land can be planted in the garden, but they have not done so. If the local Muslims wanted to give their land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X